April 02, 2020

Breaking News

2020 హజ్ ప్లాన్ డిస్కషన్

2020 హజ్ ప్లాన్ డిస్కషన్

హజ్ 2020 ప్లాన్ పై చర్చించేందుకు మినిస్ట్రి ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా తొలిసారిగా సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి సౌదీ గవర్నమెంట్ ఏజెన్సిస్ తో పాటు అన్ని భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హజరై తమ వ్యూస్ షేర్ చేసుకున్నారు. హజ్ యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. హజ్ 2020 ప్లాన్ లో భాగంగా భక్తులకు సౌకర్యాలను కల్పించటంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలి..సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. హజ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హుస్సేన్ బిన్ నాజర్ అల్-షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో..హజ్ ప్లాన్స్ ని సక్సెస్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. యాత్రికుల వసతి, సేవలను అందించేందుకు అన్ని డిపార్ట్మెంట్ల జాయింట్ ఎఫర్ట్ అవసరమని నాజర్ అల్-షరీఫ్ సూచించారు. కమ్యూనికేషన్ విస్తరించటంలో మెడ్రన్ టెక్నిక్స్ ఉపయోగించుకోవటంతో పాటు సంబంధిత అధికారులో కోఅపరేట్ చేసుకోవాలన్నారు.

Related posts