February 26, 2020

అమెరికా అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ అభ్యర్థి?

అమెరికా అధ్యక్ష పదవికి ఆర్ఎస్ఎస్ అభ్యర్థి?

తులసి గబ్బార్డ్ బ్రాహ్మణ అమెరికన్. ఆర్ఎస్ఎస్,  బిజెపి వ్యక్తి. సనాతన నాజీవాదానికి మద్దతుదారు. మోది పన్నిన అంతర్జాతీయ కుట్రలో కీలక పాత్రధారి.

ఎలా?  త్వరలో అమెరికాలో ఎన్నికలు రానున్నాయి.

డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి కి తులసి బరిలోకి దిగింది.

మరో మాటలో చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఆమెను దించింది.

ఎందుకు?

రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రపంచాన్ని శాసించబోతుందని ఆర్ఎస్ఎస్ పసిగట్టింది.

అనుకున్నట్టుగానే ఇండియా నుండి బ్రాహ్మణులు అమెరికాకు
వలస పోయారు.

అప్పటి వరకు బ్రిటన్ లో స్థిరపడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కూడా అమెరికా వెళ్లి పోయారు.

కాంగ్రెస్ పార్టీ ఈ వలసలను ప్రోత్సహించింది.

నూతన ఆర్థిక విధానాల వల్ల చాలామంది సవర్ణులు మరింత ఎక్కువ మంది అక్కడి కి వెళ్లి స్థిరపడ్డారు.

చదువు పేరుతో చాలా మంది బహుజనులు వెళ్లి గ్రీన్ కార్డు హోల్డర్లు అయ్యారు.

బ్రాహ్మణులు అమెరికా సామాజిక వ్యవస్థను మార్చేశారు.

ఉత్తరాది, దక్షిణాది బ్రాహ్మణులు అక్కడి వ్యాపారం, వాణిజ్యం, పాలనా రంగాలను నియంత్రించే స్థాయికి వచ్చారు.

హిందూ మతం పేరుతో వీళ్లు బ్రాహ్మణిజాన్ని, దేశభక్తి పేరుతో పాకిస్తాన్ వ్యతిరేకతను అక్కడి ఇండియన్లలోను,
అమెరికన్లలోను ప్రచారం చేయడం ప్రారంభించారు.

హిందూ స్వయం సేవక్ సంఘ్ అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో పని చేస్తుంది.

ఈ హెచ్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందువులను అమెరికాలో మైనారిటీలుగా గుర్తించి,
అఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్ (రిజర్వేషన్ అన్న మాట) వర్తింప చేయాలని, వ్యాపారంలో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పోరాటం జరిగింది.  విజయం సాధించారు కూడా.

ఆ రకంగా హిందూ సంస్కృతి నేర్పే పేరుతో సనాతన నాజీయిజాన్ని పిల్లలకు, పెద్దలకు ఎక్కించే పని దశాబ్దాల పాటు కొనసాగుతుంది.  మరో వైపు, పెద్దపెద్ద వైష్ణవాలయాల నిర్మాణం చేస్తూ, నిరుపేద అమెరికన్లకు అన్నం షెల్టర్ కల్పిస్తూ, వాళ్లను హిందూ  మతంలోకి మత మార్పిడి చేసే కార్యక్రమం కొనసాగుతూ వుంది.

హరే రామా హరే కృష్ణ మిషన్, రామకృష్ణ మిషన్, వివేకానంద మిషన్  ఇలా ఒక్కటేమిటి వందల సంస్థలు, వైష్ణవ, శైవ సంప్రదాయాలను హిందూ మతం పేరుతో అనేక దేశాలలో ప్రచారం చేస్తున్నారు.

అక్కడి నుండి వేల కోట్ల రూపాయలు ఇండియాలోని సనాతన నాజీ సంస్థలకు వితరణ రూపంలో పంపిస్తున్నారు.

ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుంది.

మోది విజయం వెనక అమెరికా అగ్రకులాల డబ్బు, కృషి వుంది.

మరి ఎందుకు అధ్యక్ష పదవికి పోటీ?

ఇండియాను మరో మూడు సంవత్సరాలలో హిందూ దేశంగా మార్చాలి. ఈ చర్యను వ్యతిరేకించే వాళ్లను డిటెన్షన్ క్యాంపుల్లో నిర్బంధించాలి.  వీలైనంత మేరకు ఇతర మతాలకు చెందిన వాళ్లను నిర్మూలించాలి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో డిటెన్షన్ క్యాంపులు నిర్మించాలని కేంద్ర హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ పని వేగంగా నడుస్తుంది కూడా.  ఇలాంటి మానవాళికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ప్రపంచం తప్పక నిరసిస్తుంది.

అమెరికా కూడా నిరసించి, మానవ హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ కోసం అది తీవ్రంగా స్పందిస్తుంది. హిట్లర్ నాజీవాదం, ముస్సోలినీ ఫాసిజం అమెరికా, రష్యా సైనిక చర్య వల్లే ఓడిపోయి, అంతరించాయి. ఇలాగే మళ్ళీ సనాతన నాజీవాదం విషయంలో జరిగే వీలుంది.  ఈ పరిణామాన్ని ఊహించిన ఆర్ఎస్ఎస్ ఒక పథకం రచించింది.

అమెరికాలో భారతీయులు గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో వున్నారు.

కాబట్టి తామే ఒక వ్యక్తిని అధ్యక్ష పదవికి పోటీలో పెట్టాలని నిర్ణయించాయి.

తెర వెనక వుండి ఈ వ్యవహారం నడపాలని నిర్ణయించింది.

అలా తులసి గబ్బార్డ్ అనే ఒక సవర్ణ మహిళను డెమొక్రటిక్ పార్టీ లో అధ్యక్ష పోటీకి అభ్యర్థిగా దించింది.

ట్రంపు రెండోసారి గెలిచే అవకాశం లేదు. అంతేకాదు, ట్రంపు పార్టీ కూడా తులసి గెలుపుకు సహకరించేలా ఆర్ఎస్ఎస్ ప్లాన్ గీసి వుండొచ్చు.  మోదీ, ట్రంపుల మధ్య వ్యక్తమవుతున్న సాన్నిహిత్యం అలాంటి అనుమానాలు కలగ చేస్తుంది.

కాబట్టి రేపు తులసి అమెరికా అధ్యక్షురాలు అయ్యారు అనుకుందాం. అప్పుడు మోది ఆధ్వర్యంలో జరిగే అనేక అమానవీయ చర్యలను తులసి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది.  ప్రపంచాన్ని శాసించి, ఏ దేశం కూడా ఇక్కడి బాధితులకు అండగా వుండకుండా చూసుకుంటుంది.

ఇండియా అంతర్గత వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోము అని ఒక ప్రకటన చేస్తుంది.

ప్రపంచానికి బ్రాహ్మణులు పాలకులవుతారు. ఇండియా హిందూ రాజ్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ శత్రువులుగా ప్రకటించిన వాళ్ల నిర్మూలన జరుగుతుంది.  గుప్తుల, పీష్వాల కాలం నాటి స్వర్ణయుగం దర్జాగా ఏర్పడుతుంది.
ఇదీ లక్ష్యం.  ఈ లక్ష్యం కోసమే తులసిని అక్కడ పోటిలోకి దించారు. కాబట్టి తులసి ఇండియన్ మూలాలు వున్న వ్యక్తి.

కాబట్టి మనం ఓటేసి గెలిపిద్దాం అని అమెరికాలో ఓటు హక్కు గల బహుజనులు ఆలోచించారో, మీరు ఇండియాలోని
ప్రజాస్వామ్యాన్ని, మీ రక్తసంబంధీకులను ప్రమాదంలోకి నెడుతున్నారన్న సంగతి గుర్తించండి.

నాగపూర్ కేంద్రంగా అమలవుతున్న అంతర్జాతీయ కుట్రను అర్థం చేసుకొంటే మీ నిర్ణయం మరోలా వుంటుందని కోరుతున్నాను.

Related posts