February 23, 2020

10 ఏళ్ల‌కే 185 కోట్లు సంపాదన‌

10 ఏళ్ల‌కే 185 కోట్లు సంపాదన‌

యూట్యూబ్‌ హీరో
3కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు
10 ఏళ్ల‌కే 185 కోట్లు సంపాదన‌
ర్యాన్‌ ఆట వస్తువులపై వివరణ ఇస్తాడు

పట్టుమని పదేళ్లు కూడా లేని బుడతడు యూట్యూబ్‌ ద్వారా అత్యధిక వార్షిక మొత్తం ఆర్జించిన ఘనత సాధించాడు! అతడు ఏడాదిలో ఎంత సంపాదించాడో తెలుసా? అక్షరాలా రూ.185కోట్లు! ఆ వండర్‌ కిడ్‌ అమెరికాలో టెక్స్‌సకు చెందిన ర్యాన్‌ కాజీ. వయసు 8ఏళ్లే. ‘ర్యాన్‌ వరల్డ్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌ను నడుపుతున్నాడు. అందులో ఆట వస్తువులు, విద్యా విషయాలపై వీడియోలను పోస్ట్‌ చేస్తాడు! ముద్దు ముద్దు మాటలతో ఆట వస్తువులను విశ్లేషిస్తాడు. ఈ చానల్‌కు పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో గొప్ప ఫాలోయింగ్‌ ఉంది. 2015లో ర్యాన్‌ తల్లిదండ్రులు లోన్‌, షియోన్‌ కాజీ ‘ర్యాన్‌ టాయ్స్‌ రివ్యూ’ పేరిట దీన్ని ప్రారంభించారు. తర్వాత పేరు మార్చారు. ప్రస్తుతం ఈ చానల్‌కు 3 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. 41 బిలియన్ల వ్యూస్‌ సొం తం చేసుకుంది. యూట్యూబ్‌ ఫ్లాట్‌ఫాం ద్వారా ఏడాదిలో అత్యధిక మొత్తం సంపాదించిన వాడు ర్యానేనని ఫోర్బ్స్‌ పేర్కొంది.

Related posts