February 23, 2020

10వేల మంది పాము కాటుతో మరణిస్తున్నారట..!

10వేల మంది పాము కాటుతో మరణిస్తున్నారట..!

కోయంబత్తూరు: తమిళనాడులో ప్రతీ ఏడాది 10 వేల మంది పాముకాటుతో చనిపోతున్నారట. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 30వేల ఇండ్లలో సర్వే జరుపగా..తరచూ పాముకాటు ఘటనలు జరుగుతున్నట్లు తేలింది. పాము కాటు వల్ల ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక ప్రభావం ఎలా ఉందనే అంశాలపై సర్వే జరిపాం. వీరిలో వ్యవసాయ పనుల్లో ఉన్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. మొత్తం మరణాలపై విశ్లేషణ చేయగా..వ్యవసాయక్షేత్రాల్లో 79 శాతం మంది ఉంటే అందులో 72 శాతం పనులు చేస్తున్న సమయంలో పాము కాటుకు గురైనట్లు తేలింది. 19 శాతం ఇంటికి వెళ్తున్న మార్గమధ్యలో పాముకాటుకు గురైయ్యారు. మొత్తం మరణాల్లో 82 శాతం మందిలో కాలు, పాదాల్లో పాములు కాటేశాయి. 19 శాతం మందికి చేయిపై కాట్లు పడ్డాయని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శక్తివేల్‌ వాయియపురి వెల్లడించారు.

Related posts