April 02, 2020

Breaking News

హైద‌రాబాద్ అడ్డాగా గంజాయి ర‌వాణా!

హైద‌రాబాద్ అడ్డాగా గంజాయి ర‌వాణా!

భ‌ద్రాద్రి నుంచి హైద‌రాబాద్ మీదుగా ముంబైకి త‌ర‌లిస్తున్న‌ గంజాయిని ప‌ట్టుకున్న పోలీసులు

120 కిలోల గంజాయి స్వాధీనం

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

గంజాయి అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను  ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 120 కిలోల గంజాయి, రెండు కార్లు, ఐదుఫోన్లు, రూ. 1,200 స్వాధీనం చేసుకున్న‌ట్లు  రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ తెలిపారు.

ఈనెల 27న భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో రక్కు నుంచి కుమార్‌, విజేందర్‌, రాజేష్ గౌడ్‌ 120 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ప్యాకెట్లు చేసి రెండుకార్ల సీట్లకింద, డిక్కీలో పెట్టి హైదరాబాద్‌కు తరలించి సమీర్‌కు విక్రయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కిలో రూ. 3 వేలకు కొనుగోలు చేసి రూ. 8 వేలకు అమ్మేవారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం పెద్దఅంబర్‌పేట వద్ద వారిని పట్టుకున్నారు.

గంజాయి అక్రమ రవాణా చేయ‌డంలో గ‌త చ‌రిత్ర వున్న

నాగర్‌కర్నూల్‌ జిల్లా, వెల్దండ మండలం, బైరాపూర్‌ గ్రామానికి చెందిన గండికోట కుమార్‌(28), అదే ప్రాంతానికి చెందిన నూనె విజేందర్‌(24), స్థానికంగా ఉండే కొండల్‌ అనే నేరస్థుడితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తుండేవారు.  మీర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో 2017లో గంజాయి అక్రమ రవాణా కేసులో కొండల్‌తోపాటు కుమార్‌ అరెస్టు అయ్యాడు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పు గోదావరిజిల్లా, చింతూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా కేసులో విజేందర్‌ పట్టుబడ్డాడు.

గత ఏడాది నవంబర్‌లో జైలు నుంచి విడుదలైన తర్వాత కుమార్‌, విజేందర్‌ వెల్దండ మండలం, అజలాపూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి కేశమోని రాజేష్ గౌడ్‌(23)తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేయడం ప్రారంభించారు.

వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట, కాజు క్యాంపునకు చెందిన రక్కు గంజాయి సరఫరా చేసేవాడు. అతడి వద్ద కొనుగోలు చేసిన గంజాయిని ముంబైలో ఉంటున్న సమీర్‌కు విక్రయించేవారు.

పట్టుబడిన నిందితులపై పీడి యాక్ట్‌ నమోదు చేస్తామని, రక్కు, సమీర్‌ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు.

Related posts