February 26, 2020

హైదరాబాద్ చేరుకున్న ఇరాక్ బాధితులు

హైదరాబాద్ చేరుకున్న ఇరాక్ బాధితులు

కొంతకాలంగా గల్ఫ్‌లో నరకం అనుభవిస్తున్న 16 మంది సురక్షితంగా స్వదేశంలో అడుగుపెట్టారు.  4 సంవత్సరాల క్రితం పని కోసం వీరంతా ఇరాక్ వెళ్లారు. అయితే అక్కడ ఆరు నెలలుగా తిండి తిప్పలు లేక నరకం చూసామని బాధితులు చెబుతున్నారు.

గల్ఫ్ బాధితులంతా తమ బాధలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు సమాచారం అందించి, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయంతో, భారత విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసిన తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, అక్కడ ఇరాక్‌లో చిక్కుకున్న వారిని తెలంగాణకు రప్పించారు. తమను క్షేమంగా సొంత ప్రాంతాలకు రప్పించేందుకు సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, ఎన్ఆర్ఐ శాఖ అధికారులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

Related posts