January 18, 2020

స్ట్రీట్ డ్యాన్సర్ ..

స్ట్రీట్ డ్యాన్సర్ ..

బాలీవుడ్ మూవీ `స్ట్రీట్ డ్యాన్సర్ 3డి` జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్- శ్రద్ధా కపూర్- నోరా ఫతేహి లాంటి టాప్ డ్యాన్సింగ్ స్టార్స్ తో రెమో.డి.సౌజా- ప్రభుదేవా బృందం అదిరిపోయే డ్యాన్సింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారని ఇప్పటికే ప్రచారమైంది. పైగా 3డిలో డ్యాన్సింగ్ ట్రీట్ అనగానే ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే స్ట్రీట్ డ్యాన్సర్ 3డి పోస్టర్లు.. విజువల్స్ అంచనాలు పెంచాయి.

తాజాగా ఈ సినిమా నుంచి గర్మీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అయితే ఆసక్తి రేకెత్తించే మ్యూజిక్ ఉన్నా విజువల్స్ లో చెప్పుకోదగ్గ మ్యాటర్ కనిపించలేదు. వరుణ్ ధావన్ రెగ్యులర్ ట్రూప్ స్టెప్స్ తో రొటీన్ గా నే కనిపించింది. ఇక బాహుబలి మనోహరి నోరా ఫతేహి ల్యాండ్ మైన్ స్టెప్ మాత్రం బోయ్స్ గుండెల్లో గుబులు రేపాయి. ఎందుకనో సాంగ్ లో డ్యాన్సుల పరంగా పెప్ కనిపించలేదు. ఇక ఈ విజువల్ ఆద్యంతం మొరాకో బ్యూటీ నోరా టెంప్టింగ్ మూవ్ మెంట్స్ ఆరబోత మినహా ఇది సూపర్భ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ఇక దీనికి గర్మీ అంటూ లిరిసిస్ట్ ఘాటైన పదజాలం ఉపయోగించినా కానీ అందుకు తగ్గట్టు కొరియోగ్రఫీని ఎలివేట్ చేయడంలో రెమో డి.సౌజా- ప్రభుదేవా బృందం విఫలమయ్యారనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో అద్భుతమైన కొరియోగ్రఫీతో ఇప్పటికే ఎన్నో చార్ట్ బస్టర్స్ వచ్చాయి. ఇక ఇంతకుమించి అథ్లెటిక్ ఫీట్స్ ని ఎన్నో డ్యాన్స్ రియాలిటీ షోల్లో వీక్షించేసిన ఆడియెన్ కి స్ట్రీట్ డ్యాన్సర్ 3డి ఎలాంటి ట్రీట్ ఇవ్వనుంది అన్నది సస్పెన్స్. గర్మి సాంగ్ మాత్రం ఏమంత మెప్పించలేదనే చెప్పాలి. ఈ మూవీలోని ప్రతిపాటా దేనికదే ప్రత్యేకంగా ఉంటేనే జనాల్ని మెప్పించగలదు. అసలే డ్యాన్స్ బేస్డ్ మూవీ కాబట్టి ఆ మేరకు రెమో జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే భావిద్దాం.

Related posts