April 05, 2020

Breaking News

సహజీవనం చేయాల‌నిపిస్తోంది!

సహజీవనం చేయాల‌నిపిస్తోంది!

‘పులి’ సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టి ‘తలైవన్‌’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన నటి నికిషాపటేల్‌. ఆ తర్వాత ‘ఎన్నమో ఏదో’, ‘కరైఓరం’, ‘నారదన్‌’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ‘7 నాట్కల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గౌతం దర్శకత్వంలోని ఈ సినిమాలో శక్తి హీరోగా నటిస్తున్నారు. తన చిత్ర విశేషాల గురించి నికిషా పటేల్‌ మాట్లాడుతూ.. ఎస్‌జే సూర్య దర్శకత్వంలోని ‘పులి’ సినిమా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నటించలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ నటిస్తున్నా. త్వరలోనే పెద్ద హీరోలతో జతకడతానన్న నమ్మకం ఉంది. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించలేదు. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవన శైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పారు.

Related posts