April 05, 2020

Breaking News

సన్నీ లియోన్ లా సంతోష‌పెట్టండి!

సన్నీ లియోన్ లా సంతోష‌పెట్టండి!

మహిళా దినోత్సవం రోజు మహిళలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ పెట్టాడు.
‘పురుషులకు సన్నీ లియోన్ ఇచ్చింనంత సంతోషాన్ని.. ఈ ప్రపంచంలోనే అందరు మహిళలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ మహిళా దినోత్సవం రోజున పొద్దుపొద్దునే ట్వీట్ పెట్టాడు వర్మ. ఇదొక్కటి చాలు.. ఈయన ఉద్దేశ్యాలు ఎలా ఉంటాయో చెప్పడానికి. అయితే.. ప్రత్యేకించి ఉమెన్స్ డే రోజున ఇలాంటి ట్వీట్ చేయడం అంటే.. తనే ఓ వివాదాన్ని మొదలు పెట్టడమే అనే విషయంలో వర్మ దగ్గర క్లారిటీ కచ్చితంగా ఉంటుంది. సన్నీ లియోన్ అన్నంత మాత్రాన ఆమెను తక్కువ చేయడం కాదు కానీ.. పోర్న్ స్టార్ తో పోలిస్తే.. ఏ భారతీయ మహిళా ఊరుకుని పరిస్థితి ఉండదు. అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆదర్శ మహిళలు.. విజయాలు సాధించిన ఘనకీర్తి పొందిన లేడీస్ ఉండగా.. పోల్చడానికి వర్మకు సన్నీ లియోన్ తప్ప వేరెవరూ రోల్ మోడల్ దొరకలేదా?

Related posts