April 05, 2020

Breaking News

సన్నీకి బంపర్ ఆఫర్

సన్నీకి బంపర్ ఆఫర్

ఒకప్పుడు పోర్న్ స్టార్‌‌గా ఉన్న సన్నీ లియోన్, ప్రస్తుతం బాలీవుడ్ ఐటెం గర్ల్‌గా మారి అలరిస్తోంది. సన్నీ లియోన్ నటించిన సినిమాలకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ నెలకొంది. కేవలం హిందీలోనే కాక పరాయి భాషలలోను ఈ అమ్మడికి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే సన్నీ కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. సన్నీలియోన్ ఈ మధ్య వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతోంది. స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తూ సూపర్ డూపర్ హిట్‌‌లను తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ సరసన మరో లక్కీ చాన్స్ కొట్టేసింది ఈ ముద్దు గుమ్మ.

షారూక్ నటించిన ‘రయీస్’ చిత్రంలో టైటిల్ సాంగ్‌‌లో ఆడిపాడింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాహుల్ దొలాకియా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన 8సెకన్ల టీజర్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో సన్నీ ‘లైలా ఓ లైలా’ అనే టైటిల్ సాంగ్‌‌ అందాలు ఆరబోసింది. అయితే ఈ టైటిల్ సాంగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి సెక్సీ సన్నీ మరోసారి హాట్ హాట్ అందాలు చూపించనుందన్న మాట. ఇక త్వరలో అమీర్ ఖాన్ తోను కలిసి నటించినుంది సన్నీ.

ఇదిలా ఉంటే ‘లైలా ఓ లైలా’ సాంగ్‌‌ను జనవరి 1న స్టేజి మీద డ్యాన్స్ చేసేందుకు గాను ఓ హోటల్ యాజమాన్యం శృంగార తారను సంప్రదించిందట. మారు మాట చెప్పకుండా ఓకే చెప్పేసిందట సన్నీ. ఈ ఒక్క పాటకు గాను భారీగా పారితోషకం తీసుకుందట. సుమారు రూ. 4 కోట్లు తీసుకుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే సన్నీ మాత్రం ఎక్కడా ఈ విషయం బయటికి చెప్పలేదు.

Related posts