April 05, 2020

Breaking News

సంజ‌య్ ద‌త్‌ను పెళ్లి చేసుకున్న రేఖ‌!

సంజ‌య్ ద‌త్‌ను పెళ్లి చేసుకున్న రేఖ‌!

ఈ వార్త ఆదివారం బీ టౌన్‌లో దావాన‌లంలా వ్యాపించింది. 62 ఏళ్ల వెట‌ర‌న్ యాక్ట‌ర్ రేఖ‌.. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్‌ను పెళ్లి చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. చాలా వెబ్‌సైట్ల‌లో ఈ వార్త‌ను పోస్ట్ చేస్తూ.. ఆమె జీవిత చ‌రిత్ర రేఖ‌-ద అన్‌టోల్డ్ స్టోరీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింద‌ని చెప్పాయి. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ఆ ఆటోబయోగ్ర‌ఫీ ర‌చ‌యిత యాసెర్ ఉస్మాన్‌.. ఇదంతా పుకారేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి విష‌యాలేవీ తాను బుక్‌లో రాయ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. ఆ ఘ‌ట‌న గురించి కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

రేఖ‌, సంజ‌య్ ద‌త్ 1984లో జ‌మీన్ ఆస్మాన్ సినిమా కోసం క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఆ స‌మ‌యంలోనే వీళ్ల అఫైర్ల‌పై రూమ‌ర్లు వ‌చ్చాయి. కొంత‌మంది అయితే వాళ్లు పెళ్లి చేసుకున్నార‌ని చెప్ప‌డం మొద‌లుపెట్టారు. దీంతో సంజ‌య్ ద‌త్ రంగంలోకి దిగి వాటిని ఖండించాడు అని ఉస్మాన్ వెల్ల‌డించాడు. సంజ‌య్‌ద‌త్తే వీటిని ఖండించ‌డంతో పెళ్లి జ‌ర‌గ‌లేద‌ని చెప్పాను అని ఆయ‌న తెలిపారు. రేఖ ఆటోబయోగ్ర‌ఫీ ఆమె బాలీవుడ్‌లో న‌టిగా ఆమె ప్ర‌యాణాన్ని క‌ళ్ల‌కు క‌ట్ట‌నున్న‌ది.

Related posts