April 02, 2020

Breaking News

షిల్లాంగ్ లో అల్లర్లు కర్ఫ్యూ.!

షిల్లాంగ్ లో అల్లర్లు కర్ఫ్యూ.!

గిరిజనులు గిరిజనేతరుల మ‌ధ్య విధ్వంసం

మేఘాలయలో ఇన్నర్ లైన్ ఫర్మిట్ (ఐ.ఎల్.పి) అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఐ.ఎల్.పి ని వెంటనే అమలు చేయాలని కె.ఎస్.యు, ఇతర గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు కె.ఎస్.యు సీఏఏ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

సీ ఏ ఏ పై  దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అల్ల‌ర్లు హింసాత్మ‌కంగా మారుతున్నాయి. తాజాగా షిల్లాంగ్‌లో ప‌రిస్థ‌తి చేయి దాట‌టంతో అక్క‌డ కర్ఫ్యూ  విధించారు.

మేఘాలయలో సీఏఏ వ్యతిరేక మీటింగ్ సందర్భంగా ఒక యువకుడు మృతి చెంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కర్ఫ్యూ విధించారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు 90 కిలో మీటర్ల దూరంలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ లోని షెల్లా లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, మేఘాలయలో ఇన్నర్ లైన్ ఫర్మిట్ (ఐ.ఎల్.పి) కోసం డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్ధి సంఘం ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కె.ఎస్.యు), ఐ.ఎల్.పి అనుకూల పౌర సంఘాలు శుక్రవారం సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో అల్లర్లు చెలరేగి కె.ఎస్.యుకు చెందిన విద్యార్ధి హత్యకు గురయ్యాడు.

పలువురు కె.ఎస్.యు విద్యార్ధులు, పోలీసులు గాయపడ్డారు. ఒక గుంపు వాహనాలను ధ్వంసం చేసింది. సమావేశంలో ఉన్న వారిపై దాడి చేయడానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియడం లేదు.

గిరిజన విద్యార్ధి మృతి చెందడంతో ఆగ్రహించిన గిరిజనులు గిరిజనేతరులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు. ఆరుగురు గాయపడ్డారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షిల్లాంగ్ లోని ప్రధాన ప్రాంతాలకు కూడా అల్లర్లు వ్యాపించడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

Related posts