April 02, 2020

Breaking News

షాదీ శుభలేఖపై హిందు దేవుళ్లు!

షాదీ శుభలేఖపై హిందు దేవుళ్లు!

ఓ ముస్లిం వ్యక్తి తన కుమార్తె పెళ్లి శుభలేఖపై హిందూ దేవుళ్లను  ముద్రించి ఐక్యతను చాటాడు. గణపతి, రాధాకృష్ణుల బొమ్మలతో శుభలేఖ అచ్చువేయించాడు.

సాధారణంగా ముస్లింల శుభలేఖలు నెలవంకలో నక్షత్రంతో ఉంటాయి. అయితే, ఈ శుభలేఖను చూస్తే.. హిందువుల శుభలేఖే అనిపిస్తుంది.

ఒక వైపు నెలవంక నక్షత్రం.. మరోవైపు వినాయకుడి బొమ్మ. లోపల రాధాకృష్ణుల బొమ్మతో చూడముచ్చటగా ఆ శుఖలేఖను రూపొందించారు. వీటిలో కొన్నింటిని హిందీలో ముద్రించగా, మరికొన్ని ఉర్దులో ముంద్రించారు.

తమ బంధువుల్లో చాలామందికి హిందీ చదవడం రాదని, అందుకే మిగతా శుభలేఖలను ఉర్దులో ముద్రించానని వధువు తండ్రి మహ్మద్ సరాఫత్ తెలిపాడు.  ‘‘హిందూ-ముస్లిం స్నేహాన్ని తెలిపేందుకు ఇదే మంచి మార్గం అనిపించిందంటాడు స‌రాఫ‌త్‌.

Related posts