February 23, 2020

వైరల్‌ అవుతున్న బోని కుమార్తెల సెల్ఫీ

వైరల్‌ అవుతున్న బోని కుమార్తెల సెల్ఫీ

అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత బోనీ కపూర్‌ ఫ్యామిలీ చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చిన బోని కపూర్‌ మొదటి భార్య మోనా శౌరి కపూర్‌, శ్రీదేవీ బిడ్డలు ఇప్పుడు కలిసి పోయారు. శ్రీదేవీ మరణం తర్వాత మొదటి భార్య సంతానం అన్షులా, అర్జున్‌ కపూర్‌లు, తమ చెల్లెలు జాహ్నవి కపూర్‌, ఖుషీ కపూర్‌లకు తోడుగా నిలుస్తూ వస్తున్నారు. చెల్లలను ఎవరు ఏమన్నా.. అసలు సహించకుండా.. వెంటనే వారికి అర్జున్‌,అన్షులాలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఇటీవలే జాహ్నవి కపూర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ధడక్‌’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఆ సమయాన కూడా జాన్హవి కపూర్‌కు, అర్జున్‌, అన్షులాలు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం బోని కుమార్తెలందరూ కలిసి అందమైన నగరం లండన్‌లో విహరిస్తున్నారు. ధడక్‌ షూటింగ్‌ పూర్తయి, విడుదల కాబోతున్న తరుణంలో, ఇప్పుడు దొరికిన కాస్త విరామ సమయాన్ని జాహ్నవి లండన్‌లో సోదరీమణులు అన్షులా, ఖుషీలతో గడుపుతోంది. ఈ విహార యాత్రకు సంబంధించిన ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌ను బ్రేక్‌ చేస్తున్నాయి. తమ మధ్య ఉన్న అనుబంధం ఉట్టిపడేటా ఉన్న ఓ సెల్ఫీని బోనీ పెద్ద కుమార్తె అన్షులా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అన్షులా, జాహ్నవి, ఖుషీలతో పాటు ఈ సెల్ఫీలో బాలీవుడ్‌ నిర్మాత రాజ్‌కుమార్‌ సంతోషి కూతురు తనీషా సంతోషి కూడా ఉంది. శ్రీదేవీ మరణించిన అనంతరం బోనీకి మాత్రమే సపోర్టుగా నిలువకుండా.. ఇటు చెల్లెల సాధకబాదకాలను అర్జున్‌, అన్షులాలు పట్టించుకుంటూ.. వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుండటంతో, బోనీ ఎంతో సంతోషిస్తున్నారు.

Related posts