February 26, 2020

వేరుశనగకాయల్లో విదేశీ కరెన్సీ

వేరుశనగకాయల్లో విదేశీ కరెన్సీ

విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మురాద్ ఆలం అనే వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో దుబాయ్‌కి వెళ్లేందుకు యత్నించిన ముఠాను సీఐఎస్ఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వేరుశనగకాయ(పల్లికాయ)లో నోట్లను మలిచి, దారాలతో కట్టి మరీ తరలిస్తున్నాడు. వేరు శెనక్కాయలు మాత్రమే కారు.. బిస్కెట్లు, ఇతర తినుబండారాల్లో విదేశీ కరెన్సీని పెట్టి అక్రమంగా అమెరికా, దుబాయ్ తీసుకెళ్లేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వాటిలో 2 లక్షలకు పైగా సౌదీ రియాల్, 1500 ఖతర్ రియాల్, 1200 కువైట్ దినార్ ఉన్నాయి. 300 ఒమన్ రియాల్, 1800 యూరోలను కూడా ఇదే విధంగా మురాద్ తరలించేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు.

Related posts