October 18, 2019

Breaking News

విజయవాడలో మరో కాల్ మనీ కేస్

విజయవాడలో మరో కాల్ మనీ కేస్

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరుడి బెదిరింపులు

ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య కు ప్రయత్నిoచిన మహిళా

కాలమనీ రాక్షసుడి వేధింపులకు మరో మహిళ ఆత్మహత్యాయత్నం

విజయవాడలో మరోసారి కాల్ మనీ రక్కసి తన కోరలు సాచింది … ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసి , ఎంతోమంది మహిళలను , సంసారులను వ్యభిచారులుగా మార్చిన కాల్ మనీ రాక్షసులు మళ్లీ విజృంభిస్తున్నారు.

ఇంకో సంవత్సరంలో అధికారం కోల్పోతామని భావిస్తున్న టీడీపీ బడా , చోటా నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అకృత్యాలకు మళ్లీ పాల్పడుతున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పచ్చ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయింది…ఎక్కడ ఎలాంటి దోపిడీ జరిగినా దాని వెనుక టీడీపీ నాయకుల హస్తం కచ్చితంగా ఉంటుంది.

ప్రజాప్రతినిధుల ముసుగులో పచ్చ బ్యాచ్ చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాల్సిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చోద్యం చూడటమే కాకుండా సెటిల్మెంట్లు చేయటం మరీ దుర్మార్గం.

బాధితుల పక్షాన నిలబడాల్సిన ముఖ్యమంత్రి గారు తన బాధ్యత మరచి దౌర్జన్యం చేసిన వాళ్ళను వెనకేసుకువస్తూ వారిని కాపాడేందుకు తన నలభై సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించటం సిగ్గుచేటు.

ముక్యంగా రాష్ట్ర రాజధానిలో చెలరేగిపోతున్న పచ్చ బ్యాచ్ దుర్మార్గాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి గారు విఫలం అయ్యారు

తాజాగా ఈ రోజు టీడీపీ mlc బుద్దిలేని బుద్దా వెంకన్న అనుచరుడి చేతిలో తీవ్ర అవమానాలకు గురైన మహిళ పసుపులేటి పద్మ ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది.

నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న రెండు లక్షల రూపాయలకు వడ్డీ + అసలు ఇచ్చేసినా ఇంకా తనకు బాకీ ఉన్నావంటూ పసుపులేటి పద్మా గారిని వేదిస్తుండటంతో తట్టుకోలేక గతరాత్రి పద్మ గారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

మీ ఇంట్లో లైట్ ఆరిందో వెలిగిందో నేను చాంబర్లో కూర్చొని చెబుతా అంటూ తన రియల్ పాలన గురుంచి తానే గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి తన పచ్చ వందమాగదుల అక్రమాలు ఎందుకు కనపడటం లేదు ?

Related posts