April 02, 2020

Breaking News

లోదుస్తుల్లో నాలుగు బంగారం ప్యాకెట్లు

లోదుస్తుల్లో నాలుగు బంగారం ప్యాకెట్లు

ప్రయాణికుడి నుంచి ఎయిర్‌పోర్టులో కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శనివారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన సెథిల్‌కుమార్‌ సింగపూర్‌ నుంచి తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతన్ని సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేయగా లోదుస్తుల్లో నాలుగు బంగారం ప్యాకెట్లు లభించాయి. నాలుగు ప్యాకెట్లల్లో ఉన్న బంగారాన్ని 1.1 కిలోలుగా గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి పత్రాలూ చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

Related posts