February 26, 2020

రేపిస్ట్‌ల‌ను కాపాడుతున్న బిజెపి

రేపిస్ట్‌ల‌ను కాపాడుతున్న బిజెపి

కులదీప్‌ సెంగ్వార్‌, చిన్మయానంద వంటి బిజెపి నేతలు మహిళలపై దాడులకు పాల్పడితే వారికి ఆ పార్టీ అండ.
దేశంలో రోజుకు 93 మంది మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అందులో మూడో వంతు పసిపిల్లలు ఉన్నారు. . వీటికి సంబంధించి కోర్టుల్లో 1.3 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 4 శాతం కేసులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు. అంటే మహిళలకు ఏ మాత్రం రక్షణ కల్పిస్తున్నారో స్పష్టమవుతుందన్నారు. పైగా మహిళలపై దాడులకు పాల్పడుతున్న నిందితులకు బిజెపి అండగా నిలుస్తోందని అన్నారు. కులదీప్‌ సెంగ్వార్‌, చిన్మయానంద వంటి బిజెపి నేతలు మహిళలపై దాడులకు పాల్పడితే వారికి ఆ పార్టీ నేతలు అండగా ఉన్నారు.
దేశంలో మహిళలపై దాడులు చేస్తున్న కీచకులకు బిజెపి రక్షణగా నిలుస్తుందని మాజీ ఎంపి, ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి బృందా కరత్‌ విమర్శించారు. మతోన్మాదుల ఆగడాలను తిప్పికొట్టేందుకు మనందరం ఐక్యం కావాలన్నారు. ఆ ఐక్యతతో మనం పోరాటాలు జరపాలని పిలుపునిచ్చారు. లైంగిక దాడుల సంస్కృతిపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించారు. శుక్రవారం ముంబయిలోని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) 12వ జాతీయ మహాసభ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బృందా కరత్‌ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, పసిపిల్లలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలు రూపొందిస్తుందని, అయినప్పటికీ అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మితవాద శక్తులు మత విభజనకు పూనుకోవడం సవాలుగా మారిందని, దీనికి వ్యతిరేకంగా ఐద్వా ఉమెన్‌ వాల్‌ నిర్వహించిందని అన్నారు. మోడీ, అమిత్‌ షా దేశంలో ఏ పరిస్థితులనైనా సాధారణ పరిస్థితులుగా ప్రచారం చేస్తున్నారని, నాలుగు నెలల నుండి కాశ్మీర్‌లో ఏం జరుగుతుందో చూస్తుంటే తెలుస్తుందని అన్నారు. కాశ్మీర్‌కు ఐద్వా సంఘీభావంగా ఉందన్నారు. సమస్యలపై యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు, కార్మికులు రోడ్లపైకి వస్తున్నారని, దీనిబట్టీ ఓటమి చెందినట్టేనని ఉద్ఘాటించారు. జనవరి 8న జరగబోవు సార్వత్రిక సమ్మెలో మహిళలంతా భాగస్వామ్యం కావాలని పిలుపిచ్చారు.
దేశంలో రోజుకు 93 మంది మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారని, అందులో మూడో వంతు పసిపిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. వీటికి సంబంధించి కోర్టుల్లో 1.3 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 4 శాతం కేసులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిపారు. అంటే మహిళలకు ఏ మాత్రం రక్షణ కల్పిస్తున్నారో స్పష్టమవుతుందన్నారు. పైగా మహిళలపై దాడులకు పాల్పడుతున్న నిందితులకు బిజెపి అండగా నిలుస్తోందని అన్నారు. కులదీప్‌ సెంగ్వార్‌, చిన్మయానంద వంటి బిజెపి నేతలు మహిళలపై దాడులకు పాల్పడితే వారికి ఆ పార్టీ నేతలు అండగా ఉన్నారన్నారు. హిందూ మతోన్మాదంలో భాగమైన లైంగిక దాడుల సంస్కృతిని పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎందుకు తీసుకురారు? ఎవరు వద్దన్నారు? అని ప్రశ్నించారు.
మహిళా సమస్యలతో పాటు
సైద్ధాంతిక పోరాటం : స్వరా భాస్కర్‌
దేశంలో పనిహక్కు, సమాన పనికి సమాన వేతనం, మెటర్నటీ సెలవులు, విద్య, ఉపాధి వంటి మహిళా సమస్యలతో పాటు సైద్ధాంతిక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది పుస్తకాల్లో కాదు వారి జీవితాల్లో ఉండాలని పేర్కొన్నారు. స్త్రీ శరీరంపై దాడి జరుపుతుందని, స్త్రీ శరీరాలను తమకు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. మహిళలు తమ శరీరాలను కాపాడుకోవడం కోసం పోరాటం చేయక తప్పదన్నారు.
మహిళా ర్యాలీ, బహిరంగ సభ
ఐద్వా 12వ అఖిల భారత మహాసభ ఉత్సహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహిళా ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఆజాద్‌ మైదానంలో ప్రారంభమైన మహిళ ర్యాలీ మహా పాలిక మార్గ్‌, మెట్రో సినిమా, మహాత్మా గాంధీ మార్గ్‌, క్రాస్‌ రోడ్డు మీదుగా రాణి బాగ్‌ మైదానం వద్దకు చేరుకుంది. అక్కడ మహారాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు నసీమా షేక్‌ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. బంగ్లాదేశ్‌ మహిళ పరిషత్‌ ఉపాధ్యక్షురాలు ఫయూజ్‌ మోస్లామ్‌, మాజీ ఎంపి, ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి బృందా కరత్‌, ఉపాధ్యక్షురాలు సుభాషిణీ అలీ, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌, ఐద్వా ఉపాధ్యక్షులు సుధా సుందర్‌ రామన్‌, ఎస్‌.పుణ్యవతి, బి.హైమావతి, శ్రీమతి టీచర్‌, ఆహ్వాన సంఘం చైర్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ తపతి ముఖోపాద్యాయ, మహారాష్ట్ర కార్యదర్శి ప్రాంచీ అతిల్వేకర్‌ తదితరులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌ ఐద్వా కార్యకర్తలు మహిళ సమస్యలపై గీతాలు ఆలాపించారు. అనంతరం సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పోలీసుల కాల్పుల్లో అమరులైన వీరులకు సంతాపం తెలిపారు.

Related posts