December 11, 2019

Breaking News

రెండున్నర లక్షలకోట్ల రుణమాఫీ

రెండున్నర లక్షలకోట్ల రుణమాఫీ

15 మంది బడాబాబులకు రెండున్నర లక్షలకోట్ల రుణమాఫీ
దేశవ్యాప్తంగా ఉన్న బడాబాబులకు కొమ్ముకాసేందుకే మోదీ సర్కారు ఉన్నదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గత రెండేళ్లుగా 15 మంది పారిశ్రామిక వేత్తలకు మోదీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసిందని ఆయన చెప్పారు. అంతేకాని పేద ప్రజలకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వానికి మనసురాలేదని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అప్పుడు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ అన్నది ప్రజల హక్కు అని.. దేశం అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ఆ విధంగా ముందుకు పోతామని రాహుల్ చెప్పారు. జీఎస్టీని మోదీ ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ లా అమలు చేస్తుందని.. ఐదారు రకాల ట్యాక్స్ స్లాబులు పెట్టి ప్రజలను దోచుకుతింటుందని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే జీఎస్టీ స్లాబుతో అసలైన ట్యాక్స్ విధానం తీసుకువస్తుందని రాహుల్ చెప్పారు. మోదీ పాలనలో చిన్నపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని.. బీజేపీ నేతలే పలు అకృత్యాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

Related posts