December 14, 2019

Breaking News

రామాలయం విశ్వాసాలకు సంబంధించిన అంశం’

రామాలయం విశ్వాసాలకు సంబంధించిన అంశం’

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశం మరోసారి ఊపందుకుంటున్నట్టే కనిపిస్తోంది. కేంద్రంలోని వరుస మంత్రులు, సీనియర్ నేతలు తరచు దీనిపై మాట్లాడుతుండటం ఈ ఊహాగానాలకు ఊతం ఇస్తోంది. రామాలయం అంశం 2019 ఎన్నికల ప్రచారాస్త్రం కాదంటూ ఆ నేతలు చెబుతున్నా ఈసారి కొత్త పల్లవి కూడా వినిపిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున రాహుల్, ములాయం వంటి నేతలు కలిసివస్తే రామాలయ నిర్మాణం అంశానికి ఓ పరిష్కారం సాధ్యమేనంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా సైతం అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంపై స్పందించారు.

శనివారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో రామాలయ నిర్మాణం తమ విశ్వాసానికి సంబంధించిన అంశమని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రామాలయం అంశం లెవనెత్తుతామనడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. రామాలయం నిర్మాణం చర్చలు లేదా, కోర్టు తీర్పుతోనే సాధ్యమని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. కాగా, పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వస్తే భవ్య రామమందిర నిర్మాణం సాధ్యమైనంత త్వరలో సాకారమవుతుందని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి సైతం ఇటీవల వ్యాఖ్యానించారు.

Related posts