February 26, 2020

యూత్ ని వేడెక్కిస్తున్న కాజ‌ల్‌

యూత్ ని వేడెక్కిస్తున్న కాజ‌ల్‌

పూల్ సైడ్ అందాల ఆరబోత ఎందరో భామల్ని సోషల్ మీడియాల్లో పాపులరయ్యేలా చేసింది. నిరంతరం ఒంటరి దీవుల విహారంతో లైవ్ ఫోటోలతో వేడెక్కిస్తూ భామలకు కొదవేమీ లేదు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో అందాల చందమామ కాజల్ చేరింది.

కాజల్ నెవ్వర్ బిఫోర్ స్విమ్ సూట్ లుక్ రివీలైంది. చారల బికినీలో కిరాక్ పుట్టించింది. స్విమ్ సూట్ ధరించి బులుగు నీళ్లలో జలకాలాడుతూ .. కాజల్ ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ట్రీట్ ఇవ్వనేలేదు. చందమామలోని ఈ కొత్త కోణం యూత్ ని వేడెక్కించింది.

ప్రస్తుతం తన సోదరి నిషా అగర్వాల్ తో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లిన కాజల్ అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. సోదరి వారసుడితో నచ్చినట్టు ఆటలాడుకుంటున్న ఫోటోలు ఇప్పటికే ఇన్ స్టాలో రివీలయ్యాయి. తాజాగా స్విమ్మింగ్ పూల్ సెలబ్రేషన్స్ తో ఈ భామ మైమరిపించింది. ఈ సెలబ్రేషన్ పూర్తి చేసుకుని తదుపరి కొత్త సంవత్సరం తొలి వారంలోనే భారతీయుడు 2 (ఇండియన్ 2) షూటింగ్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది.

Related posts