February 23, 2020

ముస్లిం చిన్నారులపై ఉక్కుపాదం!

ముస్లిం చిన్నారులపై ఉక్కుపాదం!

దేశంలో ముస్లింల సంఖ్యను తగ్గించేం దుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం గత మూడేండ్ల లో పది లక్షల మందికిపైగా ముస్లింలపై అక్ర మ వలసదారుల ముద్ర వేసి నిర్బంధ కేం ద్రాలకు, జైళ్లకు తరలించింది. తల్లిదండ్రులకు దూరమై వేదన అనుభవిస్తున్న చిన్నారులు.
చైనా సర్కార్‌ అభంశుభం తెలియని ముస్లిం చిన్నారులపై ఉక్కుపాదం మోపుతున్నది. దేశంలో ముస్లింల సంఖ్యను తగ్గించేం దుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం గత మూడేండ్ల లో పది లక్షల మందికిపైగా ముస్లింలపై అక్ర మ వలసదారుల ముద్ర వేసి నిర్బంధ కేం ద్రాలకు, జైళ్లకు తరలించింది. ఇప్పుడు ము స్లిం చిన్నారులను బలవంతంగా తల్లిదండ్రు ల నుంచి వేరు చేసి బోర్డింగ్‌ స్కూళ్లకు పంపుతున్నది. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ పశ్చిమ ప్రాంతంలో బోర్డింగ్‌ స్కూళ్ల పేరుతో తెరిచిన వందల పాఠశాలల్లోకి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది పిల్లలను తరలించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఊహ తెలియని వయసులో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇ వీ ఒక రకమైన నిర్బంధ కేంద్రాలయ్యాయి. పేదరికంతో ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న శరణార్థుల పిల్లలకు మంచి విద్య అందించేందుకే ఈ పాఠశాలలను ప్రారంభించామని అధికారులు చెప్తున్నారు. ముస్లిం పిల్లలపై తల్లిదండ్రుల ప్ర భావం పడకుండా చేసేందుకు ఈ స్కూళ్లు ప్రారంభి స్తున్నట్టు ప్రభు త్వం 2017లో చె ప్పింది. వీటి చు ట్టూ భద్రత కల్పిస్తున్నారు. వీటిపై మీడియాకు చెప్పిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారు.

Related posts