February 19, 2020

Breaking News

ముజఫర్‌నగర్‌లో ముస్లింల పరిస్థితి

ముజఫర్‌నగర్‌లో ముస్లింల పరిస్థితి

ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే ఆందోళనల పేరుతో ముజఫర్‌నగర్‌లోని ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ధ్వంసమైన స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లను చూస్తే వాళ్ల ధీన స్థితి అర్ధమవుతోంది.

ముజఫర్‌నగర్‌లోని ముజఫర్‌నగర్‌లోని సర్వత్‌కి చెందిన హజీ హమీద్ హసన్(72) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శుక్రవారం(డిసెంబర్ 20) రోజు రాత్రి 10.57గంటలకు అకస్మాత్తుగా పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి రావడమే ఆలస్యం కనిపించిన ప్రతీ వస్తువును ధ్వంసం చేసుకుంటూ పోయారు. రిఫ్రిజిరేటర్స్,వాషింగ్ మెషీన్స్,కప్ బోర్డ్స్.. ఇలా ప్రతీ దాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో నాలుగు బైక్స్ ఉంటే.. ఆ నాలుగింటిని ధ్వంసం చేశారు. హజీ హమీద్ హసన్ ఇంటిపై హజీ హమీద్ హసన్ ఇంటిపై పోలీసుల దాడి జరిగే ముందు వరకు.. ఆ ఇల్లు పండుగ శోభను సంతరించుకున్నట్టే ఉండేది. కానీ ఆ తర్వాత తుఫాను ధాటికి విలవిల్లాడి మిగిలిపోయిన అవశేషంగా మారిపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తన ఇద్దరు మనవరాళ్లకు పెళ్లి చేయాలని హమీద్ హసన్ కుటుంబం భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటినుంచే చేసుకుంటోంది. ఇందుకోసం ఇంట్లో రూ.3.25లక్షలు నగదు,కొంత బంగారాన్ని దాచిపెట్టగా.. పోలీసులు వాటిని కూడా తీసుకుపోయారని హసన్ ఆరోపించారు. మనవరాళ్ల పెళ్లిళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో తమ ఇంటిపై జరిగిన పోలీసుల దాడి తమను కోలుకోని దెబ్బతీసిందని ఆయన వాపోయారు.
బస్సులను తగలబెట్టడమే తప్పే ‘నిజమే.. బస్సులను తగలబెట్టడమే తప్పే. కానీ ఆ కారణంతో మాపై ఎందుకు దాడి చేస్తున్నారు. నేనో 72 ఏళ్ల వృద్దుడిని. నిరసనల్లో నేనెక్కడా పాల్గొనలేదు..’ అంటూ హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముస్లిం కుటుంబాలనే టార్గెట్ చేశారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు. ముస్లింల ప్రార్థనలు ముగిశాక డిసెంబర్ 20,శుక్రవారం మధ్యాహ్నం ముస్లింల ప్రార్థనలు ముగిశాక మీనాక్షి చౌక్‌లో హింస చెలరేగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్థానిక దుకాణాలన్నింటిని మూసివేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పోలీసులు తమ పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అక్కడి ముస్లిం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. చాలాకాలంగా మీనాక్షి చౌక్ ముస్లిం వ్యాపారులకు ఒక హబ్‌గా ఉందని,పక్కనే ఉన్న శివ చౌక్‌లో ఒక్క దుకాణాన్ని కూడా టచ్ చేయని పోలీసులు.. మీనాక్షి చౌక్‌లో దుకాణాలన్నింటినీ మూసివేశారని ఆరోపించారు. కేవలం ముస్లిం అయినందుకే తమను టార్గెట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

పోలీసులు సీజ్ మీనాక్షి చౌక్‌లో మొత్తం 67 దుకాణాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ అల్లర్లకు పాల్పడ్డవారి ఆస్తులను వేలం వేయడం ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వారిని కలవరపెడుతున్నాయి. మహమ్మద్ అనీస్ అనే ఓ స్థానిక రెస్టారెంట్ వ్యాపారి.. ‘సీఎం చెప్పినట్టే మా ఆస్తులను వేలం వేస్తారా..? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్ధం కావడం లేదు.’ అని వాపోయాడు. తాము ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని,వ్యాపారులుగా తమ వ్యాపారంలో స్థిరత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పాడు. పోలీసులు,ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమ జీవనోపాధిపై సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపినట్టుగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Related posts