April 02, 2020

Breaking News

మార్చి 15న షా పర్యటన..

మార్చి 15న షా పర్యటన..

అమిత్ షా పర్యటనలోనే కొత్త అధ్యక్షుడి నిర్ణ‌యం! పార్టీ శ్రేణుల్లో నూత‌న ఉత్తేజం క‌ల్పించేలా షా ప‌ర్య‌ట‌న‌. పర్యటనలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించే అవకాశం ఉంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణలోకి ఆహ్వానించి పౌరసత్వ సవరణ చట్టం – ఎన్నార్సీ – ఎన్పీఆర్ కు మద్దతుగా మార్చి 15వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.

అమిత్ షా పర్యటనతో కేసీఆర్ తీరును ఎండగట్టాలని – పౌరసత్వ సవరణ చట్టం – ఎన్నార్సీ – ఎన్పీఆర్ మద్దతుగా అవగాహన కల్పించాలని బీజేపీ భావిస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టం – ఎన్నార్సీ – ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రం దృష్టిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డారు. మొదటి నుంచి ఈ విధానాలపై కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా తమ పార్టీ ఎంపీలతో వ్యతిరేకంగా ఓటు వేయించారు.

రాష్ట్రంలో వాటిని అమలు చేయమని బాహాటంగా ప్రకటించారు.అయితే ఇటీవల అదే నిర్ణయానికి కట్టుబడి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని పౌరసత్వ సవరణ చట్టం – ఎన్నార్సీ – ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు.
త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దానికి వ్యతిరేకంగా బిల్లు తెచ్చి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే దీన్ని వ్యతిరేకిస్తున్న నాయకులందరితో కలిసి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. దీంతో బీజేపీ టీఆర్ ఎస్ అధినేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related posts