April 02, 2020

Breaking News

మాదాపూర్ లో గ‌జం 1,866/-!

మాదాపూర్ లో గ‌జం 1,866/-!

మాదాపూర్ లో 924 గజాల స్థ‌లం రూ.17.25 లక్షలే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి – టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు ఇలా వున్నాయి.

నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఇవిగో ఆ ఆస్తులు.. మేం అవినీతి చేయలేదు.. కష్టపడి సంపాదించాం అని చెబుతూ వివరాలు వెల్లడించారు.

ఆ నారా కుటుంబం ఆస్తులు పరిశీలించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి లోకేశ్ – చంద్రబాబుపై ట్విట్టర్ లో గట్టిగా వేసుకున్నాడు. అయితే ఆ వివరాలన్నీ ప్రధాన పత్రికల్లో సమగ్రంగా వచ్చాయి. వాటిని తీక్షణంగా పరిశీలిస్తే ఒకచోట సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేది కనిపించింది.

హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ కొలువైన ప్రాంతంలో – అత్యంత విలువైన చోట చంద్రబాబు కోడలు బ్రాహ్మణికి 924 గజాల స్థలం ఉందని ప్రకటించారు. అయితే ఆ స్థలం విలువ కేవలం రూ.17.25 లక్షలుగా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అంతటి కాస్ట్ లీ ప్రాంతంలో వారికి అంత తక్కువ విలువకు భూమి ఉండడం సందేహాలు వస్తున్నాయి.

రాష్ట్ర రాజధాని ఐటీ పరిశ్రమ కొలువైన ప్రాంతం – అత్యంత విలువైన ప్రాంతంలో 924 గజాల స్థలం రూ.17.25 లక్షలుగా ప్రకటించడంతో ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

కాకి లెక్కలు ప్రజలు ఎవరూ నమ్మరని – అసలు మిమ్మల్ని ఆస్తుల లెక్కలు ఎవరూ ప్రకటించమని అడుగుతున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Related posts