April 02, 2020

Breaking News

మమ్మల్ని తీసుకెళ్లండి!

మమ్మల్ని తీసుకెళ్లండి!

దుర్భర పరిస్థితుల్లో భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు

చైనాలో కొవిడ్‌-19 ప్రభావిత వుహాన్‌ నగరంలో ఇద్దరు భారతీయ దంపతులు స్వదేశానికి వచ్చేందుకు పాట్లు పడుతున్నారు. యూపీకి చెందిన ఆ దంపతులు తమను స్వదేశానికి రప్పించండంటూ కేంద్రప్రభుత్వానికి సామాజిక మాధ్యమాల విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు చైనాలో ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వీడియోలో వివరించారు. యూపీకి చెందిన ఆశిశ్ యాదవ్‌ చైనాలోని టెక్స్‌టైల్‌ వర్శిటీలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య నేహ పీహెచ్‌డీ స్కాలర్‌. కొవిడ్‌-19 కారణంగా ఇటీవల చైనాలోని భారతయుల్ని రప్పించేందుకు కేంద్రం విమానం పంపింది. కానీ ఆ సమయంలో నేహకు శస్త్రచికిత్స జరగడంతో రాలేకపోయామని.. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాలేవని వారు వీడియోలో వివరించారు. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌ మొత్తం ఖాళీ అయిందని.. తమను భారత్‌కు తీసుకువెళ్లాలంటూ ప్రధానిని కోరారు.

ఇదిలా ఉండగా తాజాగా భారత విదేశాంగ శాఖ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. చైనాలో ఉంటున్న భారతీయులు స్వదేశానికి రావాలనుకున్నవారు అక్కడి రాయబార కార్యాలయానికి సమాచారం అందజేయాలని తెలిపింది. వారందరినీ భారత్‌ రప్పిస్తామని.. వారు భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సూచించింది. కొవిడ్ కారణంగా ఇప్పటికే చైనాలో 1700 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవల వుహాన్ నుంచి 600 భారతీయులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే.

Related posts