April 05, 2020

Breaking News

మత్తెక్కించే భామలు.. ఆకర్షించే ఆంటీలు !

మత్తెక్కించే భామలు.. ఆకర్షించే ఆంటీలు !

ఊరూ, పేరూ తెలియని.. ఆంటీలతో, అమ్మాయిలతో వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నారా? ఒక్క క్లిక్కుతో విదేశీ అమ్మాయిలతో చాట్‌లోకి వెళ్తున్నారా? హాట్‌ లుక్సూ.. మత్తెక్కించే మాటలు.. అంతకు మించిన వేషాలకు అట్రాక్ట్‌ అవుతున్నారా? అయితే జాగ్రత్త… మీ పర్సనల్‌ డేటా మొత్తం హ్యాకర్ల చేతిలో ఉందన్న సంగతి మర్చిపోకండి. ఒక్క వీడియో కాల్‌తో.. మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బంతా ఊడ్చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, జీమెయిల్.. ఇలా అన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అదెలాగో మీరే చూడండి.

టెక్‌ యుగంలో ప్రపంచం చిన్నదైపోయింది. ఒక్క క్లిక్‌తో… విశ్వసమాచారం క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. టెక్నాలజీలో ఎంత వేగంగా దూసుకుపోతున్నామో… దాంతో అంతే వేగంగా మోసపోతున్నామనే విషయాన్ని మాత్రం జనాలు గుర్తించట్లేదు. ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, ఆడియో కాలింగ్‌ల స్టేజ్‌ ఎప్పుడో దాటేశాం. ఇప్పుడంతా వాట్సప్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, లైవ్‌ చాట్‌..!!. ఎవరితో అయినా ఒకే రకమైన కాలింగ్‌. ఇందుకు తగ్గట్టే.. రోజుకో కొత్త రకం మొబైల్ అప్లికేషన్స్‌ పుట్టుకొస్తున్నాయి.

నిన్నా.. మొన్నటిదాకా తెలిసిన వ్యక్తులతోనే వీడియో కాల్స్‌ మాట్లాడేవాళ్లు. కానీ… ఇప్పుడో కొత్త టెక్నాలజీ పుట్టుకొచ్చింది. అవతలి వ్యక్తి ఎవరో తెలియకపోయినా.. వాళ్లతో ఏ అవసరం లేకపోయినా… వీడియో కాల్‌ మాట్లాడుకునే యాప్స్‌ వచ్చేశాయి. లివ్‌యూ, బిగో లైవ్‌, క్వాయ్‌, అప్‌లైవ్‌, లైవ్‌ టాక్‌, మ్యాచ్‌ అండ్‌ టాక్‌, హాట్‌ లైవ్‌…. ఇలాంటివి బోలెడున్నాయి. గర్ల్‌ఫ్రెండ్స్‌ లేరని బాధ పడుతున్నారా…? అందమైన అమ్మాయిలు, ఆంటీల వాట్సప్‌ నంబర్లు కావాలా…? అనే క్యాప్షన్లు పెట్టిమరీ యాప్స్‌ను అడ్వర్టైజ్‌ చేసుకుంటున్నాయి కంపెనీలు. ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, యూట్యూబ్‌ ఇలా… ఏ సైట్‌ ఓపెన్‌ చేసినా ఇలాంటి యాడ్స్‌ కనిపిస్తున్నాయి.

ఈ తరహా యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మరింత ఈజీ. కనెక్ట్‌ విత్‌ జీమెయిల్‌, లేదా కనెక్ట్‌ విత్‌ ఫేస్‌బుక్‌ అని మాత్రమే అడుగుతున్నాయి. ఏమవుతుందిలే అనే చిన్న నిర్లక్ష్యంతో… ఇన్‌స్టాల్‌ చేసుకుందామనే తొందరలో ఫేస్‌బుక్‌ లేదా జీమెయిల్‌తో యాప్‌లోకి ఎంటరవుతున్నారు. ఆ యాప్స్‌.. ఐదారు మంది ముక్కుముఖం తెలియని వాళ్లతో లైవ్‌ చాట్‌, వీడియో కాల్‌ చేసుకునే అవకాశమిస్తున్నాయి. అలా యాప్‌కు అలవాటు పడగానే… ఫ్రీ కాయిన్స్‌ అయిపోయాయని, మరికొన్ని కాయిన్స్‌ కొంటే… కాల్స్‌ కంటిన్యూ చేసుకోవచ్చనే మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది. వాటి ధర 90 రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌, పేటీఎం.. ద్వారా కాయిన్స్‌ కొనాలని మరో మెసెజ్‌ డిస్‌ప్లే అవుతుంది.

అయితే ఇక్కడే మొదలవుతుంది అసలు మోసం.. వీడియో కాల్స్‌కి అలవాటు పడ్డవారు. కాయిన్స్‌ కొనేందుకు బ్యాంక్‌ అకౌంట్‌ డీటెయిల్స్‌ ఇస్తే, అవి కాస్త హ్యాకర్ల చేతిలోకి వెళ్తున్నాయి. అమ్మాయిలతో కనెక్ట్‌ అవాలన్న ఆలోచన తప్ప… ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. యాప్‌లో ఎంటర్‌ చేసే ప్రతీ సమాచారం థర్డ్‌ పార్టీ చేతిలోకి వెళ్తుంది. మన మొబైల్‌ నెంబర్‌తో అనుసంధానించి ఉన్న బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌, పేటీఎం, చివరికి ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌ అకౌంట్లు సైతం హ్యాక్‌ అవుతున్నాయి. ఇంకేముంది, టెక్నాలజీ సాయంతో బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బంతా కాజేస్తున్నారు.

ఈ తరహా యాప్స్‌తో డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. మనీ ట్రాన్స్‌ఫర్‌ అయిన అకౌంట్‌ ఏ విదేశాల్లోనే ఫేక్‌ నేమ్‌తో ఉంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీరిలో కాలేజ్‌స్టూడెంట్సే ఎక్కువగా ఉన్నారు. కాలేజ్‌లో, ఇంట్లో ఏ మాత్రం టైం దొరికినా యాప్‌ ఓపెన్‌ చేయడం… లైవ్‌లో ఉన్న అమ్మాయిలతో లైవ్‌ చాట్‌, లైవ్‌ వీడియో కాల్‌లో మాట్లాడటం సరదాగా మారింది. అయితే ఈ సరదా కాస్తా కొంపముంచుతోంది.

Related posts