April 05, 2020

Breaking News

మగాళ్లతో సంబంధాలు..

మగాళ్లతో సంబంధాలు..

ఆత్మ కథ రాసి రిలీజ్ చేసినప్పటి నుంచి.. తన లైఫ్ లో చాలానే మార్పులు వచ్చేశాయని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తెగ బాధపడిపోతున్నాడు. ముఖ్యంగా మీడియా నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నాడు కరణ్. ప్రస్తుతం మగాళ్లతో బయట కనిపించాలంటేనే.. భయపడే పరిస్థితి కల్పించారని ఆవేదన చెందుతున్నాడు.

‘యాన్ అన్ సూటబుల్ బాయ్’ అంటూ ఆటోబయోగ్రఫీలో కొన్ని నిజాలను చెప్పిన తర్వాత.. బయట ఎక్కడ మగవాళ్లతో కనిపించినా.. వారితో తనకు సంబంధం అంటగడుతున్నారని.. అతనితో పడుకున్నారా అని జర్నలిస్టులు అడుగుతున్నారని వాపోయాడు కరణ్. డిన్నర్ కు వెళ్లినా ఇలాంటి వేధింపులు తప్పడం లేదన్న ఈ దర్శకుడు.. ఇద్దరు మగాళ్లు కలిసి డిన్నర్ చేయడంలో తప్పేంటో అర్ధం కాలేదని చెబుతున్నాడు. తాజాగా అజయ్ దేవగన్ తో వచ్చిన వివాదంపై కూడా స్పందించాడు కరణ్ జోహార్.

ఓ పార్టీలో కాజోల్ గురించి ఏదో మాట్లాడానని.. నాకు ఫోన్ చేసిన అజయ్.. కనీసం నేను చెప్పినది కూడా వినకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అలాగే.. శివాయ్ మూవీకి వ్యతిరేకంగా నేను పని చేశానని తను చేసిన ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పాడు కరణ్ జోహార్.

Related posts