December 11, 2019

Breaking News

బామ్మను పెళ్లాడిన కుర్రాడు

బామ్మను పెళ్లాడిన కుర్రాడు

ఉక్రెయిన్ కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు 81 ఏళ్ల బామ్మను పెళ్లాడిన వైనం  సంచలనంగా మారింది.  తనకు బంధువైన ఆమెపై తనకున్న ప్రేమ కారణంగానే పెళ్లాడినట్లు ఆ కుర్రాడు చెబుతుంటే.. అక్కడి వారు మాత్రం అదంతా ఉత్త అబద్ధమని.. అసలు కారణం వేరేనని చెబుతున్నారు.

విషయం మరింత బాగా అర్థం కావాలంటే కొన్ని వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉక్రెయిన్ లో నిర్బంద సైనిక శిక్షణ తప్పనిసరి. అంటే.. ఒక వయసులోకి రాగానే సైనిక శిక్షణలో పాల్గొనాల్సిందే. ఇందుకు మినహాయింపులు ఉండవు. అయితే.. అనుకోని కారణాలకు మాత్రం శిక్షణ నుంచి మినహాయింపు ఇస్తారు. ఒక వయసు రాగానే పెళ్లి జరగటం.. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండి.. ఆమెను చూసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటే మాత్రం నిర్బంద సైనిక శిక్షణ నుంచి మినహాయింపు ఇస్తారు.

సరిగ్గా ఇదే పాయింట్ ను తనకు అనుకూలంగా సదరు కుర్రాడు మార్చుకున్నాడన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే అక్కడి స్థానికులు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడు విడి రోజుల్లో ఆమెతో కనిపించడని.. ఆమె ఒంటరిగా నివసిస్తూ ఉంటుందని చెబుతారు. అధికారులు సైన్యంలో యువకుల్ని రిక్రూట్ చేసుకునేందుకు వచ్చినప్పుడు మాత్రం.. ఆమెతో అతడు కనిపిస్తాడని.. ఆమెకు తన అవసరాన్ని చెబుతూ వైద్య పత్రాల్ని చూపిస్తాడని చెబుతున్నారు.

మరి.. 81 ఏళ్ల బామ్మను ఇదే విషయం మీద అడిగితే.. తన భర్త తనను చాలా ప్రేమగా.. బాధ్యతగా చూసుకుంటాడని చెప్పటంతో అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Related posts