April 05, 2020

Breaking News

ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందా?

ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందా?

దాదాపు దశాబ్దం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రం ఠాగూర్ తరహాలో వుంటుందని ప్ర‌క్ష‌కులు అంచన నాలు వేసుకున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, రెండు రోల్స్ చేశాడు. హీరో లుక్, డ్యాన్స్ పర్వాలేదు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదిరిపోయే స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ర‌త్తాలు, సుంద‌రి, అమ్మడు లెట్స్‌డు కుమ్ముడు సాంగ్స్‌లో డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. అలాగే యాక్షన్ సీన్స్‌లో అల‌రించాడు. డైరెక్టర్ వినాయ‌క్.. మాస్ యాంగిల్‌లో చిరంజీవిని చూపించాడు. అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను… న‌వ్వుకునేవాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుందనే డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను అల‌రించాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చిరంజీవి న‌ట‌న‌, ఎమోష‌న్స్, రైతు స‌మ‌స్యల‌పై చేసే పోరాట స‌న్నివేశాలు కొంతవరకు ఓకే. అలీ, ర‌ఘుబాబు కామెడీ ట్రాక్ ఓకే. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక పృధ్వీ సన్నివేశాలు అవసరం లేకున్నా వాటిని తిరిగి చేర్చారు. ఇక దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. మైనస్ పాయింట్ల విషయానికొస్తే… చిరంజీవి రీఎంట్రీ ప్రెస్టీజియస్‌గా తీసుకున్న మూవీనే కాదు. అభిమానుల్లో ఇప్పటికీ నేనునంటూ చెప్పే ప్రయత్నం చేశారు చిరు. శంకర్ ప్లేస్‌లోకి వెళ్లిన కత్తి శీను గెటప్ మార్చుకోకుండా నేరుగా కనిపించడం చూసినవాళ్లకు డ్రామాగా కనిపించింది. సిట్యుయేషన్‌కు సంబంధంలేకుండా సాంగ్స్ రావడం ప్రేక్షకులకు కాసింత చిరాకు కలిగించింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ డ్యాన్స్‌లకే ప‌రిమిత‌మైపోయింది. న‌ట‌న‌కు స్కోప్ లేదు.. లుక్ ప‌రంగా అనుకున్నంత గ్లామ‌ర్‌గా దర్శనమీయలేదు. త‌రుణ్ అరోరా త‌న పాత్రలో ఒదిగి పోయిన‌ప్పటికీ ఎఫెక్టివ్ విల‌నిజం లేక‌పోవ‌డం మైనస్ పాయింట్. క్లైమాక్స్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ షోని కాసింత ప్రమోట్ చేసినట్టుగా కనిపించింది. నాగబాబు జడ్జీగా కనిపించిన సీన్లలో జబర్దస్త్ టీంలోని కొంతమందిని చూపించాడే తప్ప, వాళ్లకి మాట్లాడే ఛాన్స్ లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫ్యాన్స్‌కు తప్పితే, సగటు ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందని చివరకు తేలిపోయింది.

Related posts