February 26, 2020

ప్రధానితో సీఎం జగన్ ఏం చర్చించారు..

ప్రధానితో సీఎం జగన్ ఏం చర్చించారు..

ఏపీ సీఎం జగన్ బుధవారం ప్రధాని మోడీని కలిశారు. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం అయ్యారు. సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల తరుణంలో.. జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. విభజన హామీల్లో రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులతో పాటు రెవెన్యూ లోటుకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజనలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించాలని మరోసారి ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ప్రధాని మోడీతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపైనా జగన్ చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలని సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ కోరినట్టు వార్తలొస్తున్నాయి.

దాదాపు మూడు నెలల తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం కావడం, ఏం చర్చించారు అనే అంశాలు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Related posts