April 05, 2020

Breaking News

దిల్లీ అల్లర్లకు కుట్ర

దిల్లీ అల్లర్లకు కుట్ర

దిల్లీ శాసనసభ ఎన్నికల నుంచే దేశ రాజధానిలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భాజపా నేతలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు.

రెచ్చగొట్టేవారిని మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తోందని కేంద్రం తీరుపై ఏచూరి మండిపడ్డారు. దిల్లీలో చెలరేగిన అల్లర్లలో మృతిచెందినవారి, క్షతగాత్రుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన పరిహారం ఇవ్వాలని ఇవ్వాలని కోరారు. దిల్లీ ఘర్షణల్లో మృతుల సంఖ్య 22కు చేరగా.. వందలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

కర్ఫ్యూ విధించినా అల్లర్లు కొనసాగడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. దిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించడం మినహా మరో మార్గంలేదన్నారు.

ఈ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షానే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితి తీసుకురావడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.

Related posts