April 02, 2020

Breaking News

త‌న భ‌ర్త‌కు మ‌ళ్లీ పెళ్లి ?

నటి అమలా పాల్‌, ఏ.ఎల్‌. విజయ్‌లు అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్‌ ఇప్పుడు రెండో వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.విజయ్‌, అమల ప్రేమించి పెళ్లిచేసుకుని విడిపోయారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా ఈసారి తండ్రి అళగప్పన్‌ విజయ్‌కి మంచి సంబంధం చూస్తున్నారట. ఈ విషయం చిత్రీకరణలో బిజీగా ఉన్న అమలకు తెలీడంతో తీవ్ర ఉద్వేగానికి లోనైందట. ప్రశాంతంగా షూటింగ్‌లో పాల్గొనలేక డిస్ట్రబ్‌ అయినట్లు తెలుస్తోంది. అమల, విజయ్‌విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించినప్పుడు ఇప్పటికీ విజయ్‌ అంటేఇష్టమేనని అమల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2011లో దైవ తిరుమగళ్‌ చిత్ర సెట్స్‌లో అమల, విజయ్‌ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2014 జూన్‌లో వివాహం చేసుకున్నారు. 2016లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

Related posts