April 05, 2020

Breaking News

డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని పెళ్లి వద్దంది

డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని పెళ్లి వద్దంది

పెళ్లి సమయంలో వరుడి కుటుంబం వధువుకి భారీగా బహుమతులు ఇవ్వడం చైనాలో ఆనవాయితీగా వస్తోంది. పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో, సమయానికి డబ్బు సమకూరకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయట. ఓ వధువు పెళ్లి కానుకగా 160,000యువాన్ల విలువ చేసే కారును బహుమతిగా ఇవ్వాలని కోరిందట
చైనాలో వివాహానికి ముందు తేనీటి విందు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వరుడి కుటుంబసభ్యులకు వధువు ఎంతో మర్యాదగా తేనీరు అందిస్తుంది. వధువు తమపట్ల ఎంత మర్యాద పూర్వకంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ తంతు నిర్వహిస్తారట. అనంతరం వధువుకు నగదు రూపంలో కొంత మొత్తాన్ని వరుడి తండ్రి అందజేస్తాడు.
దీనిపై వధువు కుటుంబసభ్యులతో ముందే బేరసారాలు జరుగుతాయి. ఇప్పుడదంతా ఎందుకంటే వధువు జియోలికి ఈ విషయంలోనే తీవ్ర అవమానం ఎదురైంది. తేనీరు అందించిన అనంతరం వరుడి తండ్రి జియోలి చేతిలో ఎర్ర రంగు కవరు అందించాడు. ఆశగా తెరిచి చూసిన జియోలికి తీవ్ర నిరాశ ఎదురైంది.
10,001యువాన్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1,001 యువాన్లు మాత్రమే ఇవ్వడంతో నిరాశకు గురైన వధువు డబ్బును విసిరేసి, ఈ పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పేసింది. పక్కనే ఉన్న కాబోయే మామగారు, వరుడు ఆమెను సముదాయించడానికి ప్రయత్నించారు.

Related posts