April 02, 2020

Breaking News

ట్రంప్‌-మోదీ దోస్త్‌

ట్రంప్‌-మోదీ దోస్త్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీసమేతంగా, కూతురు, అల్లుడు కూడా వెంటరాగా ఇండియా వ‌చ్చాడు. అయితే ఇచ్చింది ఏమీ లేదు, తీసుకపోయిందే ఎక్కువ.

బ్రిటి ష్‌ పాలకులు రెండు వందల ఏండ్లలో చేసింది ట్రంప్‌ రెం డు రోజుల్లో చేయగలిగాడు. ఈ సంవత్సరం నవంబర్‌లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న ట్రంప్‌, ‘అమెరికా అమెరికన్లదే’ అన్న సంకుచిత నినాదంతో ఒకసారి గెలిచిన, మరోసారి గెలువాలనుకుంటున్న ట్రంప్‌ భారతదేశానికి ఏదో మేలు చేస్తాడ‌నుకోవ‌డం అతి ఆశే. ఎన్నికల్లో గెలువడం కోసమే ట్రంప్‌ అమెరికాలోని భారతీయుల హక్కుల గురించి (హెచ్‌-1 వీసా తదితర హక్కులు) కచ్చితంగా ఏమీ మాట్లాడలేదు.

ఈ రెండురోజుల హంగామాలో ఈ దేశ ప్రజలకు, మొత్తం ప్రపంచానికి ప్రధానంగా కనిపించింది ఈ ఇద్దరు అధినేతల ఆలింగనాలను, ప్రేమానురాగాలను, పరస్పర ప్రశంసలు.

ట్రంప్‌ రెండురోజుల ముప్ఫై ఆరు గంటల పర్యటనలో సబర్మతి గాంధీజీ ఆశ్రమంలో గడిపింది కేవలం 15 నిమిషాలే! ఆ 15 నిమిషాల్లో ట్రంప్‌కు గాంధీజీ జ్ఞాపకం రాలేదు. మోదీజీ తనకు జరుపుతున్న అతిథి మర్యాదల్లో ఒళ్లు మరిచిన ట్రంప్‌కు ఇంకేదీ జ్ఞాపకం రాకపోవడంలో వింత లేదు.

ప్రపంచంలోనే అన్నిటికం టే పెద్ద ఆడిటోరియంగా ప్రచారం పొందుతున్న స్థలంలో లక్ష మంది పాల్గొనే సభలో (అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు, ఆడిటోరియం వరకు కొన్ని మిలియన్ల మంది తనకు స్వాగతం పలుకుతారని మోదీ జీ అన్నట్లు ట్రంప్‌ వెల్లడించారు). అయితే మిలియన్ల ప్ర‌జ‌లు రాలేదు.

కశ్మీర్‌ వివాదంపై మధ్యవర్తిత్వం జరుపడానికి రెడీ అని మోదీ జీ దోస్తు ట్రంప్‌ పదేపదే అంటున్నారు. భారతదేశానికి ట్రంప్‌ అసలైన, సిసలైన మిత్రుడని మోదీజీ పదేపదే అంటున్నారు.

వాస్త‌వానికి 1954లో ఈ దేశం వచ్చినప్పుడు కృశ్చేన్‌, బుల్గానిన్‌ స్వయంగా కశ్మీర్‌ వెళ్లి ‘కశ్మీర్‌ భారతదేశ అంతర్భాగం’ అని సూటిగా ప్రకటించారు. ఎవరు అసలైన మిత్రులు?

అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమంలో 15 నిమిషాలు గడిపిన పిదప ట్రంప్‌నకు ఆ ఆశ్రమం నుంచి (1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం రాగానే గాంధీజీకి సత్యాగ్రహ కేంద్రంగా సబర్మతి ఆశ్రమం స్థాపన ఆలోచన అంకురించింది) భారత స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహించిన గాంధీజీ జ్ఞాపకం రాలేదు;

తర్వాత, సర్దార్‌ పటేల్‌ ఆడిటోరియంలో ఇరువై ఐదు నిమిషాలు తప్పుల తడక ప్రసంగం చేసిన ట్రంప్‌ లక్ష మందిని చూసి ముగ్ధుడైనాడు, తన మిత్రుడు మోదీజీని మెచ్చుకున్నా డు. కానీ ట్రంప్‌నకు సర్వార్‌ పటేల్‌ జ్ఞాపకం రాలేదు.

భూగోళం, చరిత్ర, సారస్వతం, సంస్కృతి, ఉద్యమాలు, రాజకీయాలు, వర్తమాన విషయా లేవీ తెలియని ట్రంప్‌నకు గాంధీజీ, సర్దార్‌పటేల్‌ ఎందుకు జ్ఞాపకం వస్తా రు?

ఒక రియల్‌ ఎస్టేట్‌ వర్తకుడికి భారత చరిత్ర తెలుస్తుందనుకోలేం. యూఎస్‌ఏ రాజకీయాలు, చరిత్రతోనైనా ఎన్నడూ సంబంధం లేని వర్తక శిఖామణి ట్రంప్‌.

ఇక్కడే పటేల్‌ స్టేడియంలో ప్రసంగిస్తూ ట్రంప్‌ ఇస్లామిక్‌ టెర్రరిజానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. ఒకవంక కరడుగట్టిన మతోన్మాదులు తాలిబాన్లతో రాజీ ఒప్పందం కోసం పాకిస్థాన్‌ సహాయంతో ప్రయత్నిస్తున్న ట్రంప్‌ సబర్మతి నేలపై అబద్ధాలాడటం ఆయ‌న‌కే చెల్లుతుంది.

Related posts