February 26, 2020

జిన్నా వాలీ ఆజాదీ? 

జిన్నా వాలీ ఆజాదీ? 

షహీన్‌బాగ్‌లో నిరసన తెలిపే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఓ జాతీయ ఛానల్‌లో మాట్లాడుతూ… ”షహీన్ బాగ్ అంటే ఏమిటి? అది కేవలం ప్రజాస్వామ్యంగా నడిచే నిరసన ప్రక్రియా? నా దృష్టిలో అయితే అంతకన్నా ఎక్కువే. వివిధ భావజాలాలు ఒకే చోటకి చేరే స్థలం. అక్కడికి చేరి ‘అసోంకో తోడో, అస్సామ్‌కీ ఆజాదీ, జిన్నా వాలీ ఆజాదీ’ అని నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలను ఎవ్వరైనా అంగీకరిస్తారా? షహీన్‌బాగ్‌లో అలాంటి నినాదాలు చేస్తున్నారు. చిన్న పిల్లల హృదయాలను కూడా కల్మషం చేసే స్థాయికి చేరిపోయింది. మోదీ, అమిత్‌షాను చంపేయండి అని ఇప్పుడు కొత్త నినాదాలు చేస్తున్నారు. వీటికి మేము పూర్తి వ్యతిరేకం” అని కుండబద్దలు కొట్టారు.

పౌరసత్వ సరవణ చట్టం గురించి కానీ, ఎన్నార్సీ గురించి కానీ ప్రజలకు మరింత వివరించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పౌరసత్వ సరవణ చట్టం వల్ల ఎవరి పౌరసత్వమూ రద్దు చేయమని, పైగా పౌరసత్వాలిస్తామని పునరుద్ఘాటించారు.

Related posts