December 11, 2019

Breaking News

చైనాలో ముస్లింలపై దమనకాండ!

చైనాలో ముస్లింలపై దమనకాండ!

చైనా లో ఉయిగుర్స్ అనబడే ఒక ఇస్లామిక్ వర్గం పై ఆదేశ ప్రభుత్వం జరిపే దమనకాండ ను నివారించటానికి సోకాల్డ్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించిన సందర్భమే లేదు కదా!  ఇదే విషయాన్ని ఇటీవల ఐఖ్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి సమావేశాల సందర్భంగా అమెరికా దక్షిణ — మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక అసిస్టెంట్సెక్రటరీ అలైస్వెల్స్ప్రశ్నించగాఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వకుండా ప్రశ్నను దాట వేసి ఒకరకంగా తప్పించుకున్నారు. సందర్భంలో చైనా ప్రతినిధి అక్కడ నుండి జారుకున్నారు.   

ఇటీవల అంతర్జాలంలో బీబీసీ తెలుగుకు చెందిన న్యూస్ వీడియోలో:

*చైనాలోని ఒక ప్రాంతంలో, ఒక వర్గానికి చెందిన మానవ హక్కుల హననంపై, ఒక సంస్కృతిని సమూలంగా నాశనం చేయడానికి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలపై సవివరంగా వివరించారు.

*అయితే కాశ్మీర్ నుంచి అమెరికా వరకు పౌర, మానవ హక్కుల హననం గురించి మాట్లాడే భారత కమ్యూనిస్టులు విషయం గురించి మాట్లాడకపోవడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.

*చైనాలో ప్రస్తుతం ఉయ్గుర్ ముస్లింలతో పాటు టర్కి భాష మాట్లాడే ఇతర ముస్లిం మైనార్టీ లకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు సామూహిక నిర్బంధ రాజకీయ శిబిరాల్లో మగ్గు తున్నారు. చైనాలో స్వయంప్రతిపత్తి కలిగిన పశ్చిమ జిన్జియాంగ్ రాష్ట్రంలో దురాగతాలు ప్రభలంగా చోటుచేసు కుంటున్నాయి.

*మతపరమైన ఉగ్రవాదంపై పోరాటం, సామాజిక స్థిరత్వ సాధన  అనే సాకులతో ఉయ్గుర్ ప్రజలు ఉండే ప్రాంతాన్ని చైనా లోని కమ్యూనిస్టు ప్రభుత్వం సామూహిక నిర్బంధ సైద్ధాంతిక, రాజకీయ శిబిరంగా మార్చేసింది.

*ఇదంతా రహస్యంగా చేపట్టడానికి ప్రయత్నించినా, విషయం బహిర్గతమై పోయింది. అసలు చైనాలో మతపరమైన ఆచారాలను కొనసాగించడానికి వీలులేని పరిస్థితి ఉంది.

 

*ఒక ప్రాంత సంస్కృతిని సమూలంగా నాశనం చేయడానికి, తమ ప్రాంతంలో ఒక మతాన్ని లేకుండా చేయడానికి చైనా చేస్తున్న దుశ్చర్యలకు అంతే లేకుండా పోతోంది.

*తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేస్తున్నారు.

*వారిని మాతృ భాష నుంచి వేరు చేస్తున్నారు.

*నిర్బంధ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంచి చైనీస్ భాషను బలవంతంగా నేర్పుతున్నారు.

*పసి వయసు నుండే వారి సంస్కతిని గురించి వారికి మాత్రం తెలియనివ్వడం లేదు.

*కనీసం వారు తెగ, జాతికి చెందిన వారో అన్న విషయమో చెప్పడం లేదు.

*దశాబ్ద కాలం పాటు వారిని నిర్బంధ రెసిడెన్షియల్స్ లో ఉంచి వారి తల్లి దండ్రులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు.

*చైనా ప్రభుత్వ రాక్షసంఒక సంస్కృతిని బావి తరాలకు అందకుండా తీవ్ర నియంత్రణలు అమలుచేస్తున్నారు.

*చైనాలో ముస్లిములు రంజాన్ నెలలో నిర్వహించే ఉపవాసాలపైనా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

*ముస్లింలు అధికంగా ఉండే క్సిజియాంగ్ ప్రాంతంలో పనిచేసే ముస్లిం ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, టీచర్లు రంజాన్ దీక్షలు చేపట్టరాదని ప్రతిసంవత్సరం ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది.

*ఉపవాస దీక్షలపై నిషేధం విధించడం ద్వారా ముస్లింల సంస్కృతి నుంచి ఉయిగర్స్ ను మైనార్టీ లను దూరం చేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

*అంతేకాకుండా విద్యార్థులు ఉపవాసాలు ఉండకూడదని, వారిని మసీదుల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

*మతపరమైన కార్యక్రమాలకు హాజరు కాకుండా చూడాలని స్కూళ్లకు సైతం ఆదేశాలు జారీ చేసింది.

 

భారతీయ కమ్యూనిష్టుల తీరు…

*ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం గురించి మానవ హక్కుల హననం గురించి పెద్దపెద్ద ఉపన్యాసాలు దంచే భారత కమ్యూనిస్టులు చైనాలో జరిగే హక్కుల హననం గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు.

*భారత దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉద్యమిద్దామని పిలుపు నిచ్చే వీళ్ళు అసలు కమ్యూనిస్టు దేశాల్లో ప్రజాస్వామ్యం మానవత మానవ హక్కులు ఎంతలా  అపహాస్యమవుతున్నాయో  చెప్పేవారు కరువయ్యారు.

*భారత్ లో నియంతృత్వ వైఖరిని ఖండించే వీళ్ళు అసలు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట్ల నియంత పాలనే కొనసాగు తుందని ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు.

*మానవ హక్కులు, సంస్కృతి, సాంప్రదాయ హననం, నిర్బంధాలు ఎక్కడ జరిగినా, ఏచ్చోట చోటు చేసుకున్నా అవి ఖండించదగినవే.

*భారత లో ప్రస్తుతం మొబ్లించింగ్, కాశ్మీర్లో అక్కడి ప్రజల హక్కులు, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న దుశ్చర్యలపై మాట్లాడే భారత కమ్యూనిస్టులుచైనాలో జరిగే మానవ హక్కుల హననం గురించి కూడా మాట్లాడుతూ ఖండించాల్సిన అవసరముందని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.

Related posts