April 02, 2020

Breaking News

కోళ్లకు కొత్త వైరస్

కోళ్లకు కొత్త వైరస్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెంలోని ఫారంలో 30వేల కోళ్లు మృతి.

కరోనా ఎఫెక్ట్‌తో చికెన్ తినడానికి ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్ బిజినెస్ పడిపోయింది. ఐతే చికెన్ వ్యాపారంపై కొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బయ్యన్నగూడెంలో ఓ వింత వైరస్ కోళ్లకు సోకింది. దీంతో ఫారంలో ఉన్న 30 వేల కోళ్లు చనిపోయాయి. ఈ వైరస్ ఏంటో తెలియక పౌల్ర్టీ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా వైరస్ వచ్చిందా.. లేక ఇంకేమైనా వచ్చిందా? అని తలలు పట్టుకున్నారు. ఎవరికీ తెలియకుండా ఆ కోళ్లను ఆ ఊరి చివరన గుంత తీసి పాతేశారు. ఇప్పటికే కరోనాతో చికెన్ అమ్మకాలు పడిపోగా… ఈ కొత్త వైరస్ తో తమ వ్యాపారం పడిపోతుందని పౌల్ట్రీ యజమానులు బాధపడుతున్నారు.

Related posts