April 02, 2020

Breaking News

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు

2012 నిర్భయ లైంగిక దాడి కేసులో దోషుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితురాలి తల్లి ఆరోపించారు. న్యాయ ప్రక్రియ ఆలస్యమయ్యేందుకు ఆయనే కారణమంటూ మండిపడ్డారు. ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ మానసిక పరిస్థితి బాగోలేదంటూ సదరు న్యాయవాది మళ్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. దోషుల తరపు లాయర్‌కు ఇప్పుడు ఏమి చేయాలో తోచడం లేదు. దీంతో ఆయన కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వినయ్ సింగ్ బాగానే ఉన్నాడు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగానే ఉంది అని ఆమె పేర్కొన్నారు.

Related posts