
అయ్యలూ అది అయ్యప్ప శాపమో, జీసస్, నబీల శాపమో కాదు! అక్షరాలా ప్రొఫెసర్ గాడ్గిల్ శాపం!😢
ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ పేరు గుర్తుందా? అవును, పర్యావరణ శాస్త్రజ్ఞులే. ఆయన్ను అప్పటి సామాజిక వన విభాగం వాళ్ళు పశ్చిమ కనుమల్లో పరిశోధనలు నిర్వహించి రిపోర్టు ఇవ్వమన్నారు. ఆయన తన సుదీర్ఘ పరిశోధనలనంతరం, అటవీ నిర్మూలన, క్వారీలు తవ్వేయడం, నదుల నుండి ఇసుక తరలింపు, వరిపోలాలను జనవాసాలుగా మార్చటం లాంటి చర్యల వల్ల ఎన్నడూ చూడని వరదలు, కొండచరియలు పడడం లాంటివి కేరళ ఎదో ఒకరోజు చూస్తుందని అన్నారు. దాదాపు అన్ని నదీ తీరాల్లో ఇసుక తవ్వేశారు దీని పరిణామం విపరీతంగా ఉంటుందన్నారు. దాదాపు రెండు వేల పేజీలు రిపోర్టు ఆయన భారత ప్రభుత్వానికి సమర్పించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టమని వేడుకొన్నారు. బదులుగా మనమేమి చేసాం, ఇటు వామపక్షాలు అటు రైట్ వింగ్ పార్టీలు ఆయన్ను తిట్టని తిట్లు తిట్టి ఆయనకు విరోదంగా పశ్చిమ కనుమల్లో ఆందోళనలు నిర్వహించాం. (పోరాడితే పోయేదేముంది…. అని డైలాగు చెప్పుకొంటూ). ఆయన అవమానంతో మిన్నకుండిపోయారు, ఇప్పుడు మీరు ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. ఎక్కనుండి ఎవరు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తున్నారు. తల దించుకొండయ్యా, అవకాశవాద రాజకీయ నాయకుల్లారా.
సముద్రం ఏదీ ఉంచుకోదు జాగ్రత్తగా తిరిగిచేస్తుంది. ఉదాహరణకు, మాలయత్తూర్ కొడనాడ్ బ్రిడ్జి మీద నీళ్లు తగ్గాక ఏమి మిగిల్చింది?ఎటు చూసినా కాళేబరాలు..ప్లాసిక్ బాటిల్స్..మట్టి..చెత్త..శవాల వాసన..
మీరే కాదు, భారతీయులందరూ ఓ పాఠం నేర్చుకోవాలి. స్వార్థంతో ప్రకృతిని కబలిస్తే, ప్రకృతి మనల్ని కబళించిన రోజు భూమ్యాకాశాలు ఏకమౌతాయి. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. మరి మనం ఏమి చేస్తున్నాము? అవకాశం ఉన్నపుడల్లా చెట్లని నరకడం,నదుల్లో ఇసుక ఇష్టానుసారంగా తవ్వడమ్..కొండల్ని తొలిచి ఇల్లు కట్టడం..మరి చివరికి ఏమి మిగిలింది..ఆలోచించండి ఫ్రెండ్స్..
(ప్రొఫెసర్ గాడ్గిల్ రిపోర్టుపై ఆసక్తిగల వాళ్ళు, గూగుల్ లో వేదికితే పూర్తి రిపోర్టు పిడిఎఫ్ ఫార్మాట్లో ఉంది).