April 02, 2020

Breaking News

కుమార్తెలపై అత్యాచారం చేసిన తండ్రి

కుమార్తెలపై అత్యాచారం చేసిన తండ్రి

త‌ల్లి ఫిర్యాదు. కేసు నమోదు చేసిన కుత్బుల్లాపూర్ పోలీసులు

కంచె చేను మేసిన చందంగా క‌న్న తండ్రే కాటేశాడు. ఇద్దరు కుమార్తెలపై ఓ తండ్రి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచ‌ల‌నం సృష్టించింది.

 

బీహార్ రాష్ట్రానికి చెందిన జితేందర్‌కుమార్ తన భార్య, పిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం కైసర్‌నగర్‌కు వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు.

మాన‌సిక ప‌రిస్థితి బాగాలేని కూతురిపై జాలి చూపించాల్సింది పోయి ఏడాది కాలంగా పెద్ద కూతురు(14)పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పెద్ద కూతురు మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో తన తల్లికి చెప్పినా, ఆమె పట్టించుకోలేదు.

శుక్రవారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో జితేందర్‌కుమార్ తన చిన్న కుమార్తె (12)పై కూడా అత్యాచారం చేసేట‌ప్పుడు ఆ చిన్నారి చేసిన ఆర్త‌నాదాల‌ను విని   జితేందర్‌కుమార్ భార్య, అతడితో గొడవకు దిగింది. దీంతో కోపోద్రిక్తుడైన జితేందర్‌కుమార్ భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. తన భర్త జితేందర్ తన ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts