September 21, 2019

Breaking News

ఏపీ ప్రజలకు ‘గుండె’ ముప్పు

ఏపీ ప్రజలకు ‘గుండె’ ముప్పు

జీవన విధానం, పని ఒత్తిడే కారణం
తాజా అధ్యయనంలో వెల్లడి
ఏపీ, ప్రజలకు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉందా? అంటే.. తాజా అధ్యయనం ఔననే అంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల ప్రజల జీవన విధానాలు, పనుల ఒత్తిడి, ఆహార అలవాట్లు వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని పేర్కొంది. కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌గా పేర్కొనే ఈ జబ్బులు రాష్ర్టాల వారీగా వివిధ స్థాయిలో పెరుగుతున్నట్టు తెలిపింది. జార్ఖండ్‌, కేరళ ప్రజలకు 13.2%-19.5%, యూపీ, ఢిల్లీ, తెలంగాణలో 15%-16%, ఉత్తరాఖండ్‌, ఏపీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 18%-19% ప్రజలు ఈ గుండె జబ్బులకు గురయ్యే అవకాశం మెండుగా ఉందని అధ్యయనం వెల్లడించింది. 2012-2014 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 7.97 లక్షల మంది వివిధ వయసుల వారిని సంప్రదించి ఈ గణాంకాలు సిద్ధం చేసినట్టు పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ హార్వార్డ్‌ టీ.హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు పేర్కొన్నారు.

Related posts