February 23, 2020

ఉల్టా వేలాడదీసి గడ్డం కోస్తా!

ఉల్టా వేలాడదీసి గడ్డం కోస్తా!

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటివరకూ ఎవరూ చేయనంత సాహసాన్ని చేసిన అరవింద్ మజ్లిస్ అధినేత అసద్ తో పాటు.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ లోని నీ అడ్డాలోనే మహ్మద్ ఫైల్వాన్ అనే నీవోడే నీ తమ్ముడ్ని యాబై సార్లు పొడిచాడని.. అప్పుడే నువ్వేం చేయలేకపోయావ్.. ఇక్కడేం చేస్తావ్ అని విమర్శించారు. ‘‘ఆ చిరిగిన దాన్ని అంటిబెట్టుకోవడానికి వాడు 9 ఏళ్ల నుంచి తిరుగుతుండు. ఇప్పటికీ ఏడాదిలో ఆర్నెళ్లు ఆస్పత్రుల చుట్టే తిరుగుతడు. చిరిగిన తన శరీరాన్ని అంటిబెట్టుకోడానికి. సొంత తమ్ముడిని కాపాడులేకపోయిన అతడు బీజేపీని చింపుతడట. నువ్వు మొన్న సభ పెట్టుకున్న దారుస్సలాంలోనే నిన్ను ఉల్టా వేలాడదీసి గడ్డం కోస్తాం. గడ్డం కోసి దాన్ని పడెయ్యం. దానికి ప్రమోషన్ ఇస్తాం. ముఖ్యమంత్రికి అంటిపెడతాం. గడ్డంలేని ముల్లా కదా మన ముఖ్యమంత్రి. అప్పుడు గడ్డం ఉన్న ముల్లా అని జనానికి అర్థమైతది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

అసద్ గడ్డాన్ని కోసి భారీ క్రేన్ కు తలకిందులుగా వేలాడదీస్తామంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎక్కడుంది? ఎక్కడుంది? అని పదే పదే అంటున్నారని.. ప్రజల గుండెల్లో ఉందన్నారు. నీ బిడ్డే (కవిత) బీజేపీ దెబ్బకు బలైంది. గడ్డం లేని మన ముల్లా కేసీఆర్. ఆయన బేటా నాస్తికుడు. వీళ్లు సెక్యులరిజం గురించి మాట్లాడతారన్నారు. మొన్న కేసీఆర్ పెద్ద కొడుకు (అసద్ ను ఉద్దేశించి) నిజామాబాద్ కు వచ్చి పెద్ద గడ్డమేసుకొని బీజేపీని..ఆర్ ఎస్ఎస్ ను చింపేస్తానని వ్యాఖ్యలు చేయటాన్ని తప్పు పట్టారు.

‘పాతబస్తీలో చాలా ప్రాంతాలు బిషప్ ఖానాల లెక్క కంపు కొడతయి. అక్కడనే మంచిగా చేసుకోలేకపోతివి. నీ తమ్ముడినే కాపాడుకోలేకపోతివి. నీకు ఇడేంపని.. బీజేపీని ఏం చేయగలవు. నీ మొఖాన్ని అద్దంలో చూసుకున్నావా’ అని అసద్ పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు.

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నిజామాబాద్ పట్టణంలో ఇందూర్ ప్రజా ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు బీజేపీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు.

మజ్లిస్ కు టీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తోందని.. నిజామాబాద్ మేయర్ పదవిని మజ్లిస్ కు అప్పగించటానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Related posts