April 05, 2020

Breaking News

ఇరాన్ క్షిపణి దాడులు..

ఇరాన్ క్షిపణి దాడులు..

ఇరాక్‌లో ఉన్న రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడులకు సంబంధించిన కొత్త వీడియోలను ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. పశ్చిమంలో ఉన్న కీర్మన్‌షా ప్రావిన్సు నుంచి ఇరాన్ తన మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాక్‌లో ఉన్న అల్ అసద్‌, ఎర్బిల్ సైనిక స్థావరాలపై డజన్ల సంఖ్యలో క్షిపణుల దాడి జరిగినట్లు తెలుస్తోంది. మిస్సైళ్ల దాడిలో సుమారు 80 మంది అమెరికా ఉగ్రవాదులు మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసియా మార్కెట్‌లో ముడి చమురు ధర 2.5 శాతం పెరిగింది. ఇప్పుడు ఇది ఒక బ్యారెల్‌కు 69.94 డాలర్లకు చేరింది. పశ్చమాసియాలో చమురు సరఫరా ఆగిపోతుందేమో అనే ఆందోళనతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ వార్తలు వచ్చిన తర్వాత బంగారం ధరల్లో కూడా పెరుగుదల వచ్చింది.

Related posts