February 26, 2020

ఇందూ కీ జవానీ..

ఇందూ కీ జవానీ..

‘కాలేజీ రోజుల్లో ప్రేమ ప్రతిపాదనలు చాలానే వచ్చాయి. ఆ వయసులో ఏదో తెలియని ఆకర్షణ సహజం. అందుకే వాటిని కేవలం అపరిపక్వమైన పనులుగానే భావించాను. ఎవరినీ ప్రేమించలేదు’ అని చెప్పింది కియారా అద్వాణీ. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ ఢిల్లీ సోయగం. ప్రస్తుతం ఆమె హిందీలో డేటింగ్ యాప్స్ నేపథ్యంలో ‘ఇందూ కీ జవానీ’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా నచ్చిన భాగస్వామిని ఎంచుకునే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా డేటింగ్ యాప్స్ గురించి తన అభివూపాయాల్ని వెల్లడించింది కియారా అద్వాణీ. ‘ఆన్‌లైన్ డేటింగ్ సంస్కక్షుతిని నేను విశ్వసించను. వీటి ద్వారా అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం దొరకదు. వాళ్లు ఎంతవరకు నిజాయితీపరులో అర్థం కాదు. కలిసి ప్రయాణం చేస్తేనే వారి అభిరుచులు, మనస్తత్వం పూర్తిగా అవగతం అవుతాయి. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మనసైన వ్యక్తి గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదనే ఉంది. ఇప్పుడు నేను సింగిల్‌గానే ఉన్నాను. నచ్చిన వ్యక్తి తారసపడితే అందరికి ఆ విషయాన్ని వెల్లడిస్తాను. ఆ రహస్యాన్ని దాచిపెట్టుకోను’ అని చెప్పింది కియారా అద్వాణీ.

Related posts