April 05, 2020

Breaking News

ఇంటికి చేరుకున్న కరీనా

ఇంటికి చేరుకున్న కరీనా

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు మగశిశువు జన్మించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. బాబుకు తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అని పేరు కూడా పెట్టారు. అయితే గురువారం కరీనా బాబుతో కలిసి ఇంటికి చేరుకున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తల్లీ బిడ్డను ఇంటికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సైఫ్‌ బాబును ఎత్తుకుని ఇంటి ఆవరణలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సైఫ్‌ అభివాదం చేస్తుంటే.. కరీనా ఆయన పక్కన నిల్చుని ఉన్నారు.

Related posts