April 02, 2020

Breaking News

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డిగ్రీ కోర్సులు!

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో డిగ్రీ కోర్సులు!

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు దారుణంగా తగ్గిపోతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై యాజమాన్యాలు దృష్టిసారిస్తున్నాయి.ఉపాధికి అవ‌కాశం వున్న సాంకేతిక డిగ్రీ కోర్సులను కళాశాలల్లో ప్రవేశపెట్టాలనే  ఆలోచ‌న‌ల‌కు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ)  అనుకూలంగా వుంది.

మారుతున్న కాలానికి తగ్గట్టుగా డేటా సైన్స్‌, కృత్రిమ మేధ వంటి వాటిలో కొత్త కోర్సులను ఆరంభించడంతో పాటు మైనర్‌, సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆరంభించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పటికే ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) సైతం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తగ్గిపోతున్న ప్రవేశాలకు ప్రత్యామ్నాయంగా సాధారణ డిగ్రీ కోర్సులను ప్రారంభించుకునేందుకు వెసులుబాటు కల్పించాలనే నూతన ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

కృష్ణా జిల్లాలో 34, గుంటూరులో 40 కలిపి 74 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వీటిలో 35వేల వరకూ సీట్లున్నాయి. చాలాకాలంగా వీటిలో సగం సీట్లు నిండడం కూడా కష్టంగా మారుతూ వస్తోంది.

ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఉండే కళాశాలల్లో 15శాతం కూడా క్యాంప‌స్ ఇంట‌ర్వూ ద్వారా భ‌ర్తీ కావ‌డం లేదు. డిగ్రీ కోర్సుల ద్వారా కొంత భర్తీ చేసుకోగలిగితే బాగుంటుందనే యోచనలో చాలా కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ విద్య కోసం అందుబాటులో ఉన్న వసతులు, ప్రాంగణాలను సగం డిగ్రీ కోర్సులకు కేటాయించాలని భావిస్తున్నాయి.

ఇంజినీరింగ్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి 156 క్రెడిట్స్‌కు నాలుగేళ్లు చదువుతారు. దీనితోపాటు మరో 18 నుంచి 30 క్రెడిట్స్‌కు మరో సబ్జెక్ట్‌ ఏదైనా చదివితే వారికి మైనర్‌ డిగ్రీని ఇచ్చేలా ఏఐసీటీఈ నూతన విధానం రూపొందించింది.

అంటే కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు మెకానికల్‌ సబ్జెక్ట్‌ను 30 క్రెడిట్స్‌కు చదివితే వారికి దానిలో మైనర్‌ డిగ్రీ ఇస్తారు. అన్ని కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ ఈ మైనర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులోనికి రానున్నాయి.

డిగ్రీ కోర్సులను. ప్రస్తుతం బోధిస్తున్న విధానం కంటే మరింత ఆధునిక పద్ధతుల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే ప్రవేశపెట్టాలనేది ఏఐసీటీఈ ప్రతిపాదన.

25 శాతం కంటే తక్కువ ప్రవేశాలు కలిగిన కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టుకునేలా అనుమతి ఇవ్వనున్నారు.

చాలా కళాశాలల్లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి సైతం లేకపోవడంతో తాజాగా ఇంజినీరింగ్‌ ప్రాంగణంలోనే డిగ్రీ, మైనర్‌ డిగ్రీ కోర్సులను ప్రారంభించే విషయంపై ఏఐసీటీఈ సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది.

Related posts