February 23, 2020

అమెరికా వీసా..ఇండియన్లకు షాక్..

అమెరికా వీసా..ఇండియన్లకు షాక్..

అమెరికాలో భారతీయులకు మరో వీసా సమస్య ఎదురైంది. అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములు – వారి పిల్లలకు పని అనుమతి కల్పించే హెచ్-4 వీసాల్లో అత్యధిక ఇంకా చెప్పాలంటే…రికార్డు స్థాయిలో లబ్ధిదారులు ఇండియన్లే. సరిగ్గా ఈ విషయంలోనే – ఆ దేశం తీసుకున్న నిర్ణయం వల్ల మన వాళ్లు ఉలిక్కిపడి కోర్టును ఆశ్రయించారు.
2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములు – వారి పిల్లలకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఈ హెచ్4 వీసాల ద్వారా వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు కల్పించారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే పిల్లల వయసు విషయంలో ఇప్పుడు షాక్ తగిలింది. ఎందుకంటే 21 ఏళ్లు దాటిన తర్వాత కూడా చదువుకుంటున్న పిల్లలు ఎఫ్ 1 వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల మనవాళ్ల ప్రయోజనాలకు భారీ దెబ్బ పడింది.

అమెరికా చట్టాల ప్రకారం ఎఫ్-1 వీసా కోటాలో భాగంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం తక్కువ వీసాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం హెచ్-4 వీసా కింద చదువుకోవడం ఉద్యోగాలు చేస్తున్న వారు నూతన కేటగిరీలో వీసాలు పొందలేకపోతున్నారు. అదే సమయంలో ప్రస్తుత కేటగిరీలో ఉండలేని పరిస్థితి. దీంతో తమ ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించారు.

Related posts