November 17, 2018

Breaking News

భారతీయుల‌కు షాకిచ్చిన ట్రంప్

భారతీయుల‌కు షాకిచ్చిన ట్రంప్

1అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు షాకిచ్చారు. తమ దేశంలో ఔట్‌సోర్సింగ్ సేవలను వినియోగించుకునే కంపెనీలపై 35 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. ఫ్లోరిడాలోని టంప, ఉత్తర కరోలీనాలోని విల్లింగ్‌టన్‌లలో జరిగిన ప్రచారసభల్లో మాట్లాడిన ఆయన.. అమెరికా సంపద దోపిడీకి గురికాకుండా ఆపుతానని, అందుకోసం వెంటనే చర్యలు చేపడుతానని అన్నారు. ఏ కంపెనీ అయినా తన సిబ్బందిని తగ్గించేసి, ఇతర దేశాలవారితో పని చేయించుకుని, తిరిగి తమ ఉత్పత్తులను అమెరికాలో అమ్మడానికి యత్నిస్తే.. వాటిపై 35 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదే నిజమైతే.. అమెరికాలో ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తున్న భారతీయ యువతకు మోకాలడ్డినట్టే. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం వంటి ఒప్పందాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా కార్పొరేట్ పన్నులను 35 నుంచి 15 శాతానికి తగ్గిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

Related posts