November 17, 2018

Breaking News

డెల్టాకు నీటి విడుదల

డెల్టాకు నీటి విడుదల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువపై కొత్తగా నిర్మించిన నియంత్రిక ద్వారా చంద్రబాబు స్విచ్‌ ఆన్‌ చేసి ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా కాలువలో చంద్రబాబు గంగ పూజ నిర్వహించారు. కృష్ణా డెల్టాలోని 7.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. గత ఏడాది కంటే వారం ముందుగానే నీటిని విడుదల చేశారు. నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, మండల బుద్ధప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న పాల్గొన్నారు

Related posts